అన్ని వివరాలు సమర్పించాం: పతంజలి
close

తాజా వార్తలు

Published : 24/06/2020 11:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్ని వివరాలు సమర్పించాం: పతంజలి

దిల్లీ: తమ కొవిడ్‌-19 ఔషధం ‘కొరోనిల్’కు సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వానికి సమర్పించామని.. ఆయుష్‌ శాఖతో ఏర్పడిన సమాచార లోపాన్ని సరిచేసుకొన్నట్లు పతంజలి సంస్థ అధ్యక్షుడు ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు. కరోనా వైరస్‌ మహమ్మారికి తాము ఆయుర్వేద విధానంలో ఔషధాన్ని కనుగొన్నట్టు పతంజలి సంస్థ మంగళవారం ప్రకటించింది. విషమ పరిస్థితిలో ఉన్న కొవిడ్‌ రోగులను మినహాయించి.. మిగిలిన బాధితులకు తమ ఔషధం వంద శాతం ఫలితాన్నిచ్చిందని పతంజలి సంస్థ వెల్లడించింది. జైపూర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌తో కలసి తాము ఈ కరోనా ఔషధాన్ని తయారుచేసినట్టు వివరించింది. అంతేకాకుండా, తొలిదశ ప్రయోగాల్లో పాల్గొన్న 280 మంది కరోనా బాధితులకు పూర్తిగా నయమైందని యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా వెల్లడించారు.

అయితే ఈ అంశంపై స్పందించిన కేంద్రం.. ‘కొరోనిల్’ అనే ఈ మందును శాస్త్రీయంగా పరిశీలించి, అనుమతులు పొందేవరకు ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య బాలకృష్ణ ‘‘ప్రస్తుత ప్రభుత్వం ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తోంది. మేము ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నియమనిబంధనలను 100 శాతం పాటిస్తూ నిర్వహించిన ప్రయోగ పరీక్షల వివరాలను అందిచాం. కొరోనిల్‌ ఔషధం విషయమై సమాచార లోపం వల్ల తలెత్తిన అడ్డంకులు తొలగిపోయాయి’’ అని ప్రకటించారు.

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని