close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 07/03/2020 18:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాగ్యనగరం.. ‘మాస్క్‌’మయం

కరోనాతో కలవరం
మాస్కు ఉంటేనే మనగలం
అదే నగరప్రజల అభిమతం
రేటు పెంచిన అవసరం
తప్పదంటూ ధరిస్తున్నారు ఈ జనం..!

చైనా నుంచి ప్రపంచ దేశాలకు తాకింది కరోనా
పరిశుభ్రతే కావాలి దీనికి నివారణ
మాస్కుల పేరుతో దుకాణదారుల దోపిడీ
దీంతో జనంలో మొదలైంది కొత్త అలజడి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి చర్యలు
భయాందోళనకు గురికాకుండా సహనం పాటించాలి అందరూ..!

హైదరాబాద్‌: నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందన్న వార్తలు విన్న నగరవాసులంతా అప్రమత్తమయ్యారు. అప్పటివరకు మాస్క్‌లు ధరించనివారు.. అసలు వాటి గురించి వినని వారు.. తెలియని వారు కూడా కొనుక్కొని మరీ ధరిస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసినా మాస్క్‌ ధరించినవారే కనిపిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు వారి వ్యాపార నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారు. అప్పటివరకు రూ.5కే లభ్యమయ్యే సాధారణ మాస్క్‌లు ఇప్పడు రూ.20 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ఇక ప్రత్యేకమైన కొన్ని మాస్క్‌ల ధరలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సాధారణ మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేని విధంగా వ్యాపారులు ధరలు పెంచేశారు. కొన్నిచోట్ల వాహనదారులకు ఉచితంగా కొంత మంది మాస్క్‌లు అందిస్తున్నారు. నగరంలో ఈరోజు మాస్క్‌లు ధరించి కనిపించిన దృశ్యాలు ఇవి..


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.