లాక్‌డౌన్‌ వేళ: కవలలను కాపాడిన పోలీసులు
close

తాజా వార్తలు

Updated : 09/04/2020 13:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ వేళ: కవలలను కాపాడిన పోలీసులు

కడప: లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేస్తున్న పోలీసులు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ ముందుంటున్నారు. ఏడు నెలల వయసులోనే పుట్టిన కవల శిశువులను కాపాడేందుకు తమవంతు కృషి చేశారు. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రిని అర్ధరాత్రి సమయంలో తెరిపించి తల్లీ బిడ్డలను సకాలంలో అక్కడికి తీసుకెళ్లారు.
వివరాల్లోకి వెళితే... కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలం అబ్బాపురానికి చెందిన రమాదేవి టెస్ట్‌ ట్యూబ్‌ విధానంలో గర్భం దాల్చారు. ఈ క్రమంలో ఆమె 
ఏడో నెలలోనే రిమ్స్‌ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చారు. అయితే అక్కడ సరైన వైద్య సదుపాయం లేదని, వెంటనే చికిత్స అందించకపోతే శిశువులు బతకడం కష్టమని వైద్యులు తెలిపారు. దీంతో ఆందోళనకుగురైన వారి తల్లిదండ్రులు వెంటనే జిల్లా ఎస్పీ అన్బురాజ్‌ను ఆశ్రయించారు. నగరంలోని ఆస్పత్రులన్నీ మూసివేశారని.. ఎలాగైనా తమ పిల్లల్ని బతికించేందుకు సహకరించాలని వేడుకున్నారు. స్పందించిన ఎస్పీ వెంటనే డీఎస్పీ సూర్యనారాయణకు ఫోన్‌ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఓ ప్రైవేటు ఆస్పత్రిని తెరిపించి తల్లీ బిడ్డలను అక్కడికి తరలించారు. ప్రస్తుతం వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. సకాలంలో స్పందించిన వైద్య సిబ్బందికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. 

 

 

 

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని