కరోనా పరీక్షల నిర్వహణలో మహారాష్ట్ర నిర్లక్ష్యం
close

తాజా వార్తలు

Published : 01/05/2020 23:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా పరీక్షల నిర్వహణలో మహారాష్ట్ర నిర్లక్ష్యం

పంజాబ్‌ ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌ సింగ్‌

చండీగఢ్‌: కరోనా పరీక్షల నిర్వహణపై నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ.. పంజాబ్‌ ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌సింగ్‌ మహారాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి స్వరాష్ట్రానికి చేరుకున్న పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. ‘ఇక్కడికి తీసుకొచ్చిన వారంతా మహారాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉన్నవారే. కేంద్రం సూచించిన కరోనా కట్టడి నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. ముందుగా అక్కడే వారిని పరీక్షించి పంపించాల్సింది. పరీక్షలు చేయడం లేదని చెప్పినా.. ఇక్కడి నుంచే వైద్య బృందాలను పంపేవాళ్లం’అని అన్నారు. నాందేడ్‌ నుంచి పంజాబ్‌కు చేరుకున్నవారిలో ఇప్పటివరకు 76 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 300 మంది వరకు పరీక్షించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని