ఎగ్జిమ్‌ బ్యాంక్‌కు రూ.15,000 కోట్లు
close

తాజా వార్తలు

Published : 23/05/2020 03:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎగ్జిమ్‌ బ్యాంక్‌కు రూ.15,000 కోట్లు

ముంబయి: క్షీణిస్తున్న విదేశీ వాణిజ్యానికి ఊతమివ్వడం కోసం ఎక్స్‌పోర్ట్‌ - ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎగ్జిమ్‌ బ్యాంక్‌)కు రూ.15,000 కోట్ల రుణ సహాయాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. ‘ఎగ్జిమ్‌ బ్యాంక్‌ తన కార్యకలాపాలకు విదేశీ కరెన్సీ రుణాలపై ఆధారపడుతుంది. కొవిడ్‌ కారణంగా అది నిధులను సమీకరించలేకపోయింది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్న’ట్లు ఆర్‌బీఐ వివరించింది. ‘90 రోజుల గడువుకు రూ.15,000 కోట్ల రుణ సహాయాన్ని కొనసాగించాలని నిర్ణయించాం. గరిష్ఠంగా ఏడాది పాటు రోలోవర్‌ చేసుకోవడానికి వెసలుబాటు ఉంటుంది. తద్వారా అమెరికా డాలరు స్వాప్‌ సదుపాయాన్ని పొంది, తన విదేశీ మారక అవసరాలను తీర్చుకోవచ్చ’ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. మరో పక్క, బ్యాంకులు ఎగుమతులకు ముందు, ఎగుమతులకు తర్వాత ఇచ్చే ఎగుమతి రుణాలకు గరిష్ఠ అనుమతి గడువును ప్రస్తుత 12 నెలల నుంచి 15 నెలలకు పొడిగించారు. జులై 31, 2020లోపు తీసుకునే రుణాలకు ఇది వర్తిస్తుంది. ఇక దిగుమతుల విషయానికొస్తే భారత్‌కు వచ్చే దిగుమతులకు చెల్లింపులను పూర్తి చేసే గడువును సైతం ఆరు నెలల నుంచి 12 నెలలకు (దిగుమతి అయిన తేదీ నుంచి) పెంచారు. జులై 31, 2020న లేదా అంతకు ముందు జరిగే దిగుమతులకు ఇది వర్తిస్తుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని