close

తాజా వార్తలు

Published : 11/08/2020 23:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోలుకుంటున్న వాహన రంగం..

దిల్లీ: లాక్‌డౌన్‌ ప్రభావంతో వాహన రంగం మొదటి త్రైమాసికంలో తీవ్ర నష్టాలను చవిచూసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత అమ్మకాల్లో కొంతమేర తిరిగి పుంజుకుంటున్నట్లు అఖిల భారత వాహన ఉత్పత్తిదారుల సమాఖ్య (ఎస్‌ఐఏఎమ్‌) తెలిపింది. ఈ మేరకు జులై నెలలో దేశవ్యాప్తంగా జరిగిన అమ్మకాలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. దాని ప్రకారం ఒక్క జులై నెలలోనే 14,64,133 ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడైనట్లు తెలిపింది. ఈ సంఖ్య జూన్‌ నెలలో అమ్మడైన 11,19,048తో పోలిస్తే 30 శాతం అధికం. అయితే గతేడాది జులైతో పోలిస్తే ఇది 14 శాతం తక్కువ.

‘‘కరోనా ప్రభావంతో గత కొద్ది నెలలుగా అమ్మకాలు క్షీణించాయి. ప్రస్తుతం ఆ పరిస్థితుల నుంచి కోలుకుంటున్నాం. ద్విచక్ర వాహనాలు, పాసింజర్‌ కార్ల అమ్మకాల్లో  కొంత వరకు పురోగతి కనిపిస్తుంది. అయితే ఈ అమ్మకాల జోరు తాత్కాలికమా లేక గతంలో మాదిరిగా అమ్మకాల జోరు కొనసాగుతుందా అనేది ఆగస్టులో జరిగే అమ్మకాలు ద్వారా తెలుస్తుంది’’ అని ఎస్‌ఐఏఎమ్‌ ప్రెసిడెంట్ రాజన్‌ వాధేరా తెలిపారు. అయితే ఈ గణాంకాల్లో టాటా మోటార్స్‌, ఫోక్స్‌వ్యాగన్‌, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్‌ బెంజ్‌ సంస్థలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలు అందుబాటులో లేని కారణంగా వాటి సంఖ్యను ఇందులో చేర్చలేదని తెలిపారు. కొవిడ్-19 ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే వాహన పరిశ్రమ కోలుకుంటుందనడానికి ఈ గణాంకాలే నిదర్శమని వాహన రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.