చుక్కల్లో బంగారం.. భవిష్యత్తు ఏమిటి?
close

తాజా వార్తలు

Published : 27/06/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చుక్కల్లో బంగారం.. భవిష్యత్తు ఏమిటి?

ఇప్పుడు కొనాలా? కొంతకాలం వేచి చూడాలా?

దిల్లీ: పసిడి పరుగులు పెడుతోంది. ఊహించని స్థాయిలో ధరలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతమైతే మరీను. రద్దీ సీజన్లు ఏమీ లేనప్పటికీ అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో బంగారం ధర ఆకాశాన్ని తాకుతోంది. 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేల మార్కును చేరిందంటే పుత్తడి ఏ స్థాయిలో కళ్లు మిరుమిట్లు గొల్పుతోందో అర్థంచేసుకోవచ్చు. కరోనా తెచ్చిన తంటాలు.. లాక్‌డౌన్‌ల పేరు చెప్పి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యాయి. మార్కెట్లు తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఆ ప్రభావాలన్నీ కలిసి  బంగారం ధరను ఆకాశమార్గం పట్టించాయంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. 

బులియన్‌ విపణిలో ఎందుకింత కలకలం?

యావత్‌ ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా భయం కమ్మేసింది. ప్రతి పరిణామాన్నీ ఆ భయమే శాసిస్తోంది. మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తోంది. దీనికి భారత్‌ కూడా మినహాయింపేమీ కాదు. కొద్ది రోజులుగా భారత్‌లో చుక్కలనంటుతున్న బంగారం ధరలే ఇందుకు నిదర్శనం. కరోనాతో తగ్గిన దిగుమతులు, ప్రభావం చూపుతున్న అంతర్జాతీయ పరిణామాలతో పుత్తడి ధరలు ఇప్పుడు ఏకంగా రూ.50వేలకు చేరువయ్యాయి. దిల్లీ రిటైల్‌ బులియన్‌ మార్కెట్లో రూ.50వేల మార్కును దాటిన 10 గ్రాముల బంగారం ధర 50,405ల గరిష్ఠస్థాయిని చూసింది. బులియన్‌ విపణిలో ఎందుకింత కలకలం అంటే నిపుణులు చెబుతున్న ఒకేఒక మాట భయం. 

అందుకే పసిడి మరింత ప్రియం

అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్రమైన అనిశ్చితి, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల అంచనాలు, బలహీనపడుతున్న డాలర్‌ విలువ వెరసి పసిడిని మరింత ప్రియం చేస్తున్నాయి. అమెరికా, మిగిలిన అన్ని దేశాల్లో కరోనా మరోసారి విధ్వంసం సృష్టించనుందన్న హెచ్చరికల మధ్య బంగారమే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు మదుపరులు. వారందరికీ ఇప్పుడు బంగారమే ఏకైక గమ్యస్థానంగా మారింది. ఈ పరిణామల నేపథ్యంలో అసలు భవిష్యత్తు ఏమిటి? పసిడి ధర పెరుగుతుందా? తగ్గుతుందా? బంగారం ధరలను ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? ఇప్పుడు కొనాలా? ఇంకొంత కాలం పాటు వేచిచూడాలా? ఇలా.. మీ మదిని తట్టే అనేక ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో.. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని