అందుకే ముంబయిలో కేసులు ఎక్కువ
close

తాజా వార్తలు

Published : 11/05/2020 17:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే ముంబయిలో కేసులు ఎక్కువ

సమూహ వ్యాప్తికి ఆధారాలున్నాయి


ముంబయి: ముంబయిలో కొన్ని చోట్ల సమూహ వ్యాప్తికి ఆధారాలున్నాయని స్టేట్ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్ ప్రదీప్‌ అవతే అన్నారు. మొత్తంగా క్ల్లస్టర్‌ కేసులే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. 
‘మహారాష్ట్ర, ముంబయిలో కరోనా కేసులు పెద్ద మొత్తంలో ఒకే దగ్గర నమోదవుతున్నాయి. ముంబయితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సమూహ వ్యాప్తి ఉన్నట్లు ఆధారాలున్నాయి. ముంబయి మహారాష్ట్ర రాజధానిగానే కాకుండా దేశ ఆర్థిక రాజధానిగా కూడా ఉండటంతో మిగతా మెట్రో నగరాలతో పోల్చుకుంటే ఈ నగరం భిన్నంగా ఉంది. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. ఒక చదరపు కిలో మీటరకు 20 వేల మంది నివసిస్తున్నారు. అందుకే ఇక్కడ కొవిడ్ 19 కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రతి కేసుకు మూలం ఎక్కడుందో కనుక్కోవాల్సిన అవసరం ఉంది’ అని ఆయన వెల్లడించారు.

దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే అత్యధికంగా 22వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ ఇప్పటి వరకు 832 మంది మృత్యువాత పడ్డారు. ముంబయి, థానే, పుణెల్లోనే కేసుల తీవ్రత అధికంగా ఉంది. అలాగే సోమవారం నాటికి భారత్‌లో సుమారు 67,000 కరోనా కేసులు నమోదయ్యాయి. 

  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని