చేతులకు సంకెళ్లతో తెదేపా ఎమ్మెల్యే నిరసన
close

తాజా వార్తలు

Published : 04/07/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేతులకు సంకెళ్లతో తెదేపా ఎమ్మెల్యే నిరసన

విశాఖ: బీసీలపై ప్రభుత్వం దాడులు చేస్తోందని పేర్కొంటూ విశాఖ జిల్లా తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ నిరసన వ్యక్తంచేశారు. తన చేతులకు సంకెళ్లు వేసుకొని   రాష్ట్ర ప్రభుత్వం తీరుపట్ల విశాఖలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలకు స్థానం లేదు. బీసీలను హంతకుల మాదిరి చిత్రీకరించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. తెదేపా సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, యనమలపై తప్పుడు కేసులు పెట్టారు. తాజాగా మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపైనా తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మంచిపేరు ఉన్న తెదేపా నేతలపై బురదజల్లేందుకు వైకాపా నడుంకట్టింది. ఇప్పటివరకు 65మంది తెదేపా నేతలపై కేసులు పెట్టారు’’ అని ధ్వజమెత్తారు.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని