close

తాజా వార్తలు

Updated : 14/08/2020 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. వ్యాధుల కాలం... జర పైలం!

కొవిడ్‌ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైంది. సీజనల్‌ వ్యాధుల ముప్పు పొంచి ఉండటంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎవరికి వారు ఆరోగ్య రక్షణకు శ్రద్ధచూపాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండడంతో.. మలేరియా, డెంగీ వంటి జ్వరాలే కాకుండా.. కలుషిత నీటితో వాంతులు, విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్‌ తదితర వ్యాధులు సోకే అవకాశాలున్నాయి. వీటితో పాటు ఏటా సెప్టెంబరు నుంచి మార్చి వరకూ ఇబ్బందిపెట్టే స్వైన్‌ఫ్లూ ఉండనే ఉంది.గతేడాది డెంగీ ఉక్కిరిబిక్కిరి చేయగా ఈ ఏడాది ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 1100 కేసులు నమోదవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భళా.. బామ్మలు..

2. రాజీస్థాన్‌!

కాంగ్రెస్‌ పార్టీలో అపోహలు గతం... గతః అని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు. గత నెలరోజుల్లో పార్టీలో ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో పొరపాట్లు ఉంటే వాటిని క్షమించి, ముందుకు సాగాలని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల రీత్యా అది అవసరమన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రమాదకర క్రీడ మన దేశంలో కొనసాగుతోంది. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసే కుట్రలు ఆగడం లేదు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఇలాగే జరిగింది. ఈడీ, సీబీఐ, ఐటీ, న్యాయ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కోర్టుపై కుట్ర కోణం

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తికి.. ఒక జడ్జికి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలను వింటే ప్రాథమికంగా కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోందని ఏపీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సంభాషణల్లో వాస్తవాలను తేల్చే బాధ్యతను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌కు అప్పగిస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీచేసింది. విచారణ జరిపి, సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని జస్టిస్‌ రవీంద్రన్‌ను కోరింది. ఆయనకు విచారణలో పూర్తి సహకారం అందించాల్సిందిగా సీబీఐ డైరెక్టర్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్లను ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సగం పడకలు సర్కారుకే

ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్డగోలు వసూళ్లకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడనుంది. సగం పడకలను ప్రభుత్వం ఆధ్వర్యంలో భర్తీ చేయడానికి ఆయా దవాఖానాల యాజమాన్యాలు అంగీకరించడంతో వాటిని ప్రభుత్వం నిర్దేశించిన రుసుములతో భర్తీ చేయడానికి మార్గం సుగమమైంది. వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో బీఆర్‌కే భవన్‌లో గురువారం ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్టుగా ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నోటీసులిచ్చినా స్పందించట్లేదా!

5. చికిత్సకు ప్రణబ్‌ స్పందిస్తున్నారు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) చికిత్సకు నెమ్మదిగా స్పందిస్తున్నారని, కీలక ఆరోగ్య సూచీలన్నీ బాగున్నాయని ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ వెల్లడించారు. తన తండ్రి ఎప్పుడూ యోధుడేనని, ఆయన త్వరగా కోలుకోవాలంటూ భగవంతుడిని ప్రార్థించండని శ్రేయోభిలాషులను కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. ప్రణబ్‌ చికిత్స పొందుతున్న ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫెరల్‌ ఆసుపత్రి కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిలో గురువారం ఉదయం కూడా ఎలాంటి మార్పూ లేదు. కీలక ఆరోగ్య సూచీలన్నీ నిలకడగా ఉన్నాయి’’ అని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకూ స్లాట్లు

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ సమయంలో ధ్రువపత్రాల పరిశీలన కోసం కేటాయించిన సమయాల్లోనే విద్యార్థులు కౌన్సెలింగ్‌ కేంద్రానికి వెళ్లడం ఇప్పటి వరకు చూశాం. ఈసారి జేఈఈ మెయిన్‌ పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకూ టైమ్‌ స్లాట్లు కేటాయించనున్నారు. జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ఈ దిశగా ఏర్పాట్లకు సమాయత్తమవుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ చర్య చేపట్టనున్నారు. సెప్టెంబరు 1 నుంచి 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మెయిన్‌ పరీక్ష జరగనుంది. ఎవరు ఏ సమయానికి కేంద్రానికి రావాలో ముందుగానే అధికారులు తెలియజేయనున్నారు. అడ్మిట్‌ కార్డుల్లో ఆ సమయాన్ని పేర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదే

రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం తమదేనని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఒక రాష్ట్రానికి రాజధానిని నిర్ణయించడంలో తమకు ఎలాంటి పాత్రా లేదని, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం కూడా స్పష్టంచేసిందని తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు 2018లో దాఖలు చేసిన పిటిషన్‌, ఆ తర్వాత దాఖలైన అనుబంధ పిటిషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహరరావు ఈ అఫిడవిట్‌ వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

ప్రజాభిప్రాయానికి భిన్నంగావెళ్లొద్దు

8. రూ.33కే ఫావిపిరవిర్‌ ఔషధం

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫార్మా కంపెనీ ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ తక్కువ ధరలో ‘ఫావిపిరవిర్‌’ ట్యాబ్లెట్‌ (200 ఎంజీ)ను తీసుకువచ్చింది. ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ.33. ఇంత వరకు దాదాపు పది కంపెనీలు ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విడుదల చేశాయి. వీటన్నింటిలో ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ ట్యాట్లెట్‌ ధరే తక్కువ. ‘ఫావిలో’ అనే బ్రాండు పేరుతో ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్‌ను విడుదల చేసినట్లు ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ వెల్లడించింది. సొంత పరిశోధన- అభివృద్ధి ద్వారా ఈ ఔషధం ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్‌)తో పాటు, ఫార్ములేషన్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. ఏడాదిగా అఘాయిత్యం

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని ప్రైవేటు అనాథ శరణాలయంలో లైంగిక దాడికి గురై మరణించిన 14 ఏళ్ల బాలిక కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనపై ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడినట్టు వాంగ్మూలంలో చెప్పిందని పటాన్‌చెరు డీఎస్పీ రాజేశ్వరరావు వెల్లడించారు. కానీ, బాలిక మూత్ర సంబంధమైన సమస్యకు శస్త్రచికిత్స చేయించామని, తలకు చిన్న గాయమైతే పసుపు అద్దామని ఆశ్రమం నిర్వాహకులు పోలీసులతో చెప్పటం అనుమానాలకు తావిస్తోంది. కరోనా సమయంలో మార్చి 21న బాలికను బంధువులు తమ ఇంటికి తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. సచిన్‌.. శతకం.. షాంపైన్‌

 వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును సొంతం చేసుకున్న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ తొలిసారి మూడంకెల స్కోరు అందుకుని నేటికి 30 ఏళ్లు. అతని శతక శతకాల ప్రయాణానికి తొలి అడుగు పడింది ఈ రోజే (ఆగస్టు 14). 1990లో ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన రెండో టెస్టు.. రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 119 పరుగులు చేసి జట్టును ఓటమి నుంచి తప్పించాడు. మూడు దశాబ్దాల క్రితం సాధించిన ఆ శతకం అతడి జ్ఞాపకాల్లో ఇంకా తాజాగానే ఉంది. ఆ సెంచరీ గురించి అడిగినప్పుడు.. అది తనకెంతో ప్రత్యేకమైందని సచిన్‌ చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.