close

తాజా వార్తలు

Published : 14/08/2020 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. 25 ఏళ్ల తర్వాత.. మధ్య ప్రాచ్యంలో శాంతి ఒప్పందం

ఉద్రిక్తతలకు నిలయమైన మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతిస్థాపన దిశగా ఓ భారీ ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో యూఏఈ, ఇజ్రాయెల్ ఓ చారిత్రక శాంతి ఒప్పందానికి వచ్చాయి. దీనిలో భాగంగా పూర్తి సాధారణ సంబంధాలు నెలకొనేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.  కాగా, ఇది ఇజ్రాయెల్, యూఏఈల మధ్య 25 సంవత్సరాల అనంతరం కుదిరిన శాంతి ఒప్పందం. ఈ మేరకు అమెరికా, ఇజ్రాయెల్‌, యూఏఈ మూడు దేశాల తరఫున ట్రంప్‌  ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రశాంత్‌భూషణ్‌ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై ఆయన చేసిన ట్వీట్లపై  కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్‌ అరుణ్‌మిశ్రాతో కూడి ధర్మాసనం .. న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు నిర్ధరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కొత్తగా 64,553 కేసులు.. 1007 మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకుపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,553 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 24,61,190కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో 1,921 కరోనా కేసులు

4. నాయకత్వం కోసం అమెరికా తపిస్తోంది :కమలా హారిస్‌

నాయకత్వం కోసం అమెరికా తపిస్తోందని ఆ దేశ ఉపాధ్యక్ష స్థానానికి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీచేసేందుకు ఎంపికైన కమలా హారిస్‌ విమర్శించారు. డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌.. కమలాను ఉపాధ్యక్ష పదవికి పోటీపడేందుకు ఎంపికచేసినట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో బైడెన్, హారిస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హారిస్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన తప్పిదాల కారణంగా అమెరికన్లు మహా మాంద్యం (గ్రేట్‌ డిప్రెషన్‌) నాటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోయారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాయపాటి మమతను విచారణకు తీసుకెళ్లిన పోలీసులు

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన కేసు దర్యాప్తును విజయవాడ పోలీసులు వేగవంతం చేశారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతకు విజయవాడ పోలీసులు రెండ్రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు రాయపాటి నివాసానికి చేరుకుని డాక్టర్‌ మమతను విచారణకు తీసుకెళ్లారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రోజుకు మిలియన్‌ టెస్టులే లక్ష్యంగా..

భారత్‌లో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజుకు 10 లక్షల పరీక్షల లక్ష్యం దిశగా టెస్టుల సంఖ్య సాగుతోంది. మరోవైపు పాజిటివ్‌ కేసులు నిత్యం 60 వేలకుపైగానే నమోదవుతున్నప్పటికీ.. డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. శుక్రవారం 64,553 కేసులు నమోదుకాగా.. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 55,573 గా ఉంది. దేశంలో రికవరీ రేటు 71 శాతం దాటింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* టీబీ టీకాతో కొవిడ్‌ నుంచి మెరుగైన రక్షణ!

7. పడగవిప్పిన ఐఎస్‌

ఆఫ్రికాలో కీలకమైన మొజాంబిక్‌లోని పోర్ట్‌ ఆఫ్‌ మొసిమ్‌బోవాను ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఆక్రమించారు. ఈ ఘటన ఆఫ్రికాలో పెను సంచలనం సృష్టించింది. ఈ పోర్టుకు అత్యంత సమీపంలోనే దాదాపు 60 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నాయి. కొన్నాళ్ల నుంచి ఇక్కడ పోర్టు కోసం భీకర పోరాటం సాగుతోందని మొజాంబిక్‌ భద్రతా దళమైన ఎఫ్‌డీఎస్‌ వెల్లడించింది. ఈ పోర్టు మొజాంబిక్‌ ప్రభుత్వం చేతిలో నుంచి ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లడం ఊహించని దెబ్బగా భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒకే కుటుంబంలో నలుగురి అనుమానాస్పద మృతి

వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందటం కలకలం రేపింది. ఆజీరాం బీ(63,) ఆమె కుమార్తె ఆస్మా బేగం(35), అల్లుడు ఖాజా పాషా (42), మనుమరాలు హసీనా(10) మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట్ల పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యదు చేయడంతో విషయం వెలుగుచూసింది. వంట గదిలో అజీరాం బీ, డైనింగ్‌ హాలులో ఆస్మా బేగం, ఇంటి వెనుక గుంత వద్ద అల్లుడు, హాలులో హసీనా మృతదేహాలు పడి ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘పరాన్నజీవి’, ‘ఆర్జీవీ’లపై మీ స్పందనేంటి?

‘‘వివాదాస్పద కథాంశాలే ప్రేక్షకుల్ని త్వరగా ఆకర్షిస్తాయి. అందుకే ఆ తరహా సినిమాలు తీస్తుంటా’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. కరోనా విస్తృతితో పోటీ పడుతూ... వేగంగా సినిమాలు రూపొందించి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారాయన. ఇటీవలే ‘పవర్‌స్టార్‌’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన ఇప్పుడు ‘థ్రిల్లర్‌’తో సిద్ధమయ్యారు. అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం ‘ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌.కామ్‌’ ద్వారా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు వర్మ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సచిన్‌ భాయ్‌.. పాజీ ఎలా అయ్యాడంటే..

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు ఎన్నో పేర్లున్నాయి. అభిమానులు ముద్దుగా లిటిల్‌మాస్టర్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌, బ్యాటింగ్‌ మ్యాస్ట్రో అంటూ పిలుచుకుంటారు. అయితే సచిన్‌కి మరో పేరు కూడా ఉంది. అదే సచిన్‌ పాజీ. సహజంగా ఇది బయటివాళ్లు ఎవరూ అనకపోయినా తన సహచరులు లేదా జూనియర్లు అలా ప్రేమతో పిలుస్తారు. పాజీ అంటే పెద్దన్న అని అర్థం. అంతకుముందు పాజీ అని 1983 ప్రపంచకప్ విజేత కపిల్‌దేవ్‌ని మాత్రమే పిలిచేవారు. 2003 ప్రపంచకప్‌ నుంచీ టీమ్‌ఇండియా క్రికెటర్లు తెందూల్కర్‌ను కూడా అదే గౌరవంతో పిలవడం మొదలుపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.