close

తాజా వార్తలు

Published : 03/12/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీఎస్‌ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకుగాను ఈ నెల 6 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని.. 8 నుంచి 12 వరకు పరిశీలన ఉంటుందని తెలిపింది. 15వ తేదీన మొదటి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయించనున్నట్లు ఉన్నత విద్యామండలి స్పస్టం చేసింది. అలాగే ఈ నెల 22నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపింది. 22న స్లాట్‌ బుకింగ్‌, 23న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 22 నుంచి 24 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించినట్లు వివరించింది. 26న చివరి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు అనంతరం 28న స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు విద్యామండలి వివరించింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన