తితిదే ఉద్యోగికి కరోనా నిర్ధారణ
close

తాజా వార్తలు

Updated : 12/06/2020 19:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తితిదే ఉద్యోగికి కరోనా నిర్ధారణ

తిరుమతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అనుబంధ ఆలయానికి కరోనా సెగ తాకింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయినట్లు తితిదే ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సదరు ఉద్యోగి కరోనా పరీక్షలు చేయించుకోగా అందులో పాటిజివ్‌ వచ్చినట్లు ప్రకటనలో వెల్లడించింది. ఆలయంతోపాటు ఉద్యోగి తిరిగిన ప్రాంతాలను రెండు రోజులపాటు మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఉద్యోగితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా ప్రొటోకాల్‌ మేరకు రెండు రోజులపాటు ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసిన అనంతరం ఆదివారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ రెండు రోజులపాటు స్వామివారి కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ప్రకటనలో తితిదే తెలిపింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని