తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి బదిలీ
close

తాజా వార్తలు

Published : 12/06/2020 23:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి బదిలీ

కరోనా కేసులు పెరగడమే కారణం

చెన్నై: తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి బీలా రాజేశ్‌ను బదిలీ చేస్తూ శుక్రవారం అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్‌ విభాగ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆమె స్థానంలో రాధాకృష్ణన్‌ను నియమిస్తున్నట్లు పేర్కొంది. ఈయన గతంలో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా విధులు నిర్వహించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈయన ఆ పదవిలోనూ కొనసాగుతారని ప్రభుత్వం వెల్లడించింది.  

తమిళనాడులో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడులోనే అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో   ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 38,716 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వారిలో 349మంది మరణించారు. 20,705 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 17,662మంది చికిత్స పొందుతున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని