తమిళనాడులో మరో 62మంది మృతి
close

తాజా వార్తలు

Published : 29/06/2020 19:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళనాడులో మరో 62మంది మృతి

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ ఈ మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 3949 పాజిటివ్‌ కేసులు.. 62 మరణాలు నమోదు కావడం కలవరపెడుతోంది. కరోనా ఉద్ధృతంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, దిల్లీ తర్వాత తమిళనాడు మూడో స్థానంలో కొనసాగుతోంది.

కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 86,224కి చేరింది. అలాగే, ఈ రోజు మరో 2212 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 47,749కి పెరిగింది. కరోనాతో పోరాడి 1141 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37331 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

చెన్నైలో రికార్డుస్థాయి కేసులు
గడిచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3949 కేసులు నమోదు కాగా.. వాటిలో ఒక్క చెన్నై నగరంలోనే 2167 పాజిటివ్‌ కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి చెన్నైలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 55,969కి పెరిగింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని