కొవిడ్‌పై టాటా ప్రాజెక్ట్స్‌ పోరు
close

తాజా వార్తలు

Published : 24/05/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌పై టాటా ప్రాజెక్ట్స్‌ పోరు

2,954కు ఆసుపత్రి పడకలు

ముంబయి: కరోనా బాధితుల చికిత్స నిమిత్తం దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను 2,954కు పెంచినట్లు టాటా ప్రాజెక్ట్స్‌ తెలిపింది. ‘భారీ మౌలిక ప్రాజెక్టులను చేపట్టిన మా అనుభవం ద్వారా దేశంలోని ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నామ’ని టాటా ప్రాజెక్ట్స్‌ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ హిమాన్షు చతుర్వేది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పడకల ఏర్పాటుతో పాటు ప్రత్యేక వైద్య సామగ్రిని సైతం అందిస్తున్నట్లు వివరించారు. వెంటిలేటర్లు, పల్స్‌ ఆక్సిమీటర్స్‌, ఆక్సిజన్‌ ఫ్లో మీటర్స్‌, హెచ్‌ఎమ్‌ఈ ఫిల్టర్స్‌, మాస్క్‌లతో పాటు ఐవీ స్టాండ్లు, సక్షన్‌ మెషీన్లు, వీల్‌ఛైర్లు, డ్రెసింగ్‌ ట్రాలీ వంటి వాటినీ అందజేసినట్లు వివరించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని