అసెంబ్లీ సమావేశాలకు నల్ల చొక్కాలతో తెదేపా
close

తాజా వార్తలు

Published : 15/06/2020 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అసెంబ్లీ సమావేశాలకు నల్ల చొక్కాలతో తెదేపా

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నల్ల చొక్కాలతో హాజరు కావాలని తెలుగుదేశం శాసనసభాపక్షం నిర్ణయించింది. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమావేశాలకు హాజరు కావాలా? వద్దా?.. అక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై ఈరోజు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేతలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అయితే అసెంబ్లీకి వెళ్లొద్దని పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు సూచించారు. కానీ, సమావేశాలకు హాజరు కాకపోతే మండలిలో కొన్ని బిల్లులు ఆమోదించుకునే ప్రమాదం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన శాసనసభాపక్షం అవసరమైతే పరిస్థితిని బట్టి వాకౌట్‌ చేసి రావొచ్చనే ఏకాభిప్రాయానికి వచ్చింది. తెలుగుదేశం నేతలపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ నల్ల చొక్కాలతో వెళ్లాలని ఈ మేరకు నిర్ణయించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని