కొవిడ్‌ ఔషధాల గుర్తింపుపై టెక్‌ మహీంద్రా పరిశోధన
close

తాజా వార్తలు

Published : 16/05/2020 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ ఔషధాల గుర్తింపుపై టెక్‌ మహీంద్రా పరిశోధన

దిల్లీ: కొవిడ్‌-19 చికిత్సకు ఉపయోగించడానికి వీలయ్యే ఔషధాలను కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) ద్వారా గుర్తించడానికి టెక్‌ మహీంద్రాకు చెందిన మేకర్స్‌ ల్యాబ్‌ రంగంలోకి దిగింది. ‘మేధావులు, వ్యాపారులు, స్వతంత్ర పరిశోధకులను ఏకతాటిపై తీసుకురావడం కోసం ప్రముఖ బయో శాస్త్రవేత్త(ఉదయ్‌ సక్సేనా)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. తద్వారా ఔషధ సమ్మేళనాలను పరీక్షించడానికి, చికిత్సకు ఉపయోగించే మందులను గుర్తించడానికి వీలవుతుంద’ని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మానవ ఆతిథ్య కణాల్లోకి వైరస్‌ ప్రవేశించకుండా చేయడమే మా లక్ష్యం. ఇదే సాధ్యమైతే కరోనా అనేది హానికరం కాదు’ అని మేకర్స్‌ ల్యాబ్‌ గ్లోబల్‌ అధిపతి నిఖిల్‌ మల్హోత్రా పేర్కొన్నారు. టెక్‌ మహీంద్రా ఇప్పటికే లిగాండ్స్‌, యాంటీ వైరల్‌ ఔషధాలపై(వీటికి ఎఫ్‌డీఏ అనుమతులున్నాయి) మాలిక్యులార్‌ డాకింగ్‌ పరిశోధనలు చేసింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని