80 రోజుల తర్వాత..తిరుమలలో భక్తుల సందడి 
close

తాజా వార్తలు

Updated : 11/06/2020 10:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

80 రోజుల తర్వాత..తిరుమలలో భక్తుల సందడి 

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా జూన్‌ 8 నుంచి మూడు రోజుల పాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించిన తితిదే.. లోటుపాట్లను పరిశీలించి ఇవాళ్టి నుంచి టికెట్లు కలిగిన భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తోంది. రోజుకు ఆరువేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మూడువేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మరో మూడు వేల మందికి ఉచిత టైంస్లాట్‌ టోకెన్లు అందించింది. టికెట్లు పొందిన వారిని మాత్రమే అధికారులు కొండపైకి అనుమతిస్తున్నారు. 

మరోవైపు సాధారణ భక్తులతోపాటు వీఐపీలకు కూడా స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. వీఐపీ టికెట్లు పొందిన పలువురు ప్రముఖులు ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ హెచ్‌ఈఆర్‌సీఎంసీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, తెలంగాణ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి, పొగాకు బోర్డు ఛైర్మన్‌ రఘునాథబాబు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే తితిదే టికెట్లను కేటాయిస్తోంది. ప్రతి రోజూ ఉదయం 6.30 నుంచి గంట పాటు వీఐపీ దర్శనానికి కేటాయించింది. అనంతరం సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. 

బుధవారం 7,150మంది భక్తులు స్వామివారిని దర్శంచుకున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం రూ.20లక్షలు వచ్చినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామన్నారు. భౌతికదూరం, పరిశుభ్రత పాటించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని