close

తాజా వార్తలు

Updated : 21/09/2020 13:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. రాజ్యసభలో 8 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల పట్ల ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లుల్ని నిబంధనలకు విరుద్ధంగా ఆమోదింపజేశారంటూ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌‌ సింగ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును తోసిపుచ్చారు. సభా నియమాల ప్రకారం డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాసం ఆమోదనీయం కాదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కరోనా వేళ..ఉత్తరానికి మరో ముప్పు!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఉత్తర భారత వాసులకు మరో ముప్పు పొంచివుంది. హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంట మొదళ్లను తగలబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యం తాజా పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశాలున్నాయని వాతావరణ, వ్వవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊపిరి తిత్తులపై ప్రభావం చూపే కరోనా వైరస్‌ బాధితులకు ఇది మరింత ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంటుందని సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కొవిడ్‌ రికవరీల్లో.. అగ్రస్థానంలో భారత్‌!

భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారిసంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. నిత్యం దాదాపు 90వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. కోలుకుంటున్న వారిసంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ నుంచి కోలుకుంటున్నవారు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3కోట్లు దాటగా వారిలో ఇప్పటికే 2కోట్ల 20లక్షల మంది కరోనా బాధితులు కోలుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలంగాణలో కొత్తగా 1,302 కరోనా కేసులు

4. ‘సుశాంత్‌ ప్రాణాలతో తిరిగొచ్చినట్లుంది’  

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో ఓ కళాకారుడు ఆయన మైనపు విగ్రహాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. దీన్ని చూసిన ఆయన సోదరి శ్వేతా సింగ్‌ భావోద్వేగానికి గురయ్యారు. విగ్రహాన్ని చూడగానే.. తన సోదరుడు ప్రాణాలతో తిరిగి వచ్చిన భావన కల్గిందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాన్ని రూపొందించిన కళాకారుడు సుశాంత రాయ్‌ (64)కి ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు మైనపు విగ్రహాన్ని ఎలా తయారు చేశారో తెలిపే వీడియోను ఆమె షేర్‌ చేశారు. త్వరలోనే ఈ విగ్రహాన్ని మ్యూజియంలో పెట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికాలో వీచాట్‌ నిషేధానికి బ్రేక్‌

అమెరికాలో వీచాట్‌ మెసేజింగ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌పై ట్రంప్‌ ప్రభుత్వం విధించిన నిషేధం అమలును ఆపాలంటూ ఆ దేశ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌ల వల్ల జాతీయ భద్రతకు ముప్పుందంటూ ట్రంప్‌ ప్రభుత్వం విధించిన నిషేధం.. ఆదివారం అర్థరాత్రి నుంచి అమలులోకి రావాల్సి ఉంది. కాగా నిషేధం అమలుకు కొద్ది గంటల ముందే న్యాయస్థానం ఆదేశాలు వెలువడటం గమనార్హం. వీ చాట్‌ సోషల్‌ మీడియా యాప్.. చైనాకు చెందిన టెన్నెంట్‌ హోల్డింగ్స్‌ సంస్థకు చెందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రూ.14 లక్షల కోట్ల రిలయన్స్‌ కథ

కరోనా సృష్టించిన ప్రకంపనలకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కంపించిపోతున్నాయి. అతికొద్ది సంస్థలు మాత్రమే వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ఉన్న సంస్థల్లో ఈ వృద్ధిరేటు కనిపిస్తోంది. కానీ, ఓ సంస్థ మాత్రం ఈ రంగంలో లేకపోయినా కళ్లు చెదిరే మార్కెట్‌ విలువను సాధించింది. అమెరికా దిగ్గజం జెఫ్‌ బెజోస్‌ వలే కరోనా కాలంలో స్టాక్‌ మార్కెట్లలో ఆకర్షణీయమైన షేరుగా నిలిచింది. అదే భారత్‌లో పెట్రోలియం, టెలికాం రంగ దిగ్గజం రిలయన్స్‌. ఆ సంస్థ మార్కెట్‌ విలువ ఇప్పుడు భారత్‌లోని ఏ కంపెనీకి అందని స్థాయికి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పక్షిని సాలీడు మింగడం ఎప్పుడైనా చూశారా?  

చిన్న చిన్న పురుగుల్ని, వానపాముల్ని సాలీళ్లు తినడం చూసుంటారు. కానీ, ఏకంగా ఓ పక్షినే మింగడం ఎప్పుడైనా చూశారా? సాలిపురుగు చిన్నది కదా, దాంతో పోలిస్తే పక్షి పెద్దది కదా.. అది పక్షిని మింగడమేంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఎక్కడో తెలియదు గానీ, చనిపోయిన ఓ పక్షిని అవికులారియా జాతికి చెందిన సాలిపురుగు మింగేందుకు ప్రయత్నించింది. కొద్దికొద్దిగా లోపలకి లాక్కునేందుకు చూసింది. దీనికి సంబంధించిన వీడియోను ‘నేచర్‌ ఈజ్‌ స్కేరీ’ అకౌంట్‌ నుంచి ట్విటర్‌లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు

పాకిస్థాన్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ షాహీన్‌ అఫ్రిది విజృంభించాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు నేలకూల్చాడు. ఇంగ్లాండ్‌ కౌంటీలో భాగంగా హాంప్‌షైర్‌, మిడిల్సెక్స్‌ మధ్య ఆదివారం టీ20 మ్యాచ్‌ జరిగింది. అందులో షాహీన్‌ 6/19తో రెచ్చిపోయాడు. జాన్‌ సింప్సన్‌, స్టీవెన్‌ ఫిన్‌, తిలాన్‌, టిమ్‌ ముర్తాఘ్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చి రికార్డు సృష్టించాడు. అఫ్రిది దెబ్బకు మిడిల్సెక్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కుప్పకూలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ట్రోల్స్‌ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లా.. : వితిక

ఒకానొక సమయంలో తన గురించి వచ్చిన ట్రోలింగ్స్‌ చూసి మానసికంగా కుంగుబాటుకు లోనయ్యానని నటి వితిక అన్నారు. ఇటీవల యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన వితిక.. పలు ప్రత్యేక వీడియోలతో తరచూ అభిమానులను ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె.. తన జీవితానికి సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని నెటిజన్లకు తెలియజేస్తూ సరికొత్త వీడియోను విడుదల చేశారు. గతేడాది తన భర్త వరుణ్‌ సందేశ్‌తో కలిసి వితిక ఓ ప్రముఖ రియాల్టీ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే సదరు రియాల్టీ షో చూసిన ప్రేక్షకులు ఆమెను నెగటివ్‌గా అర్థం చేసుకుని విపరీతంగా ట్రోల్స్‌ చేశారట. దీంతో తన కుటుంబం కొంతకాలం ఇబ్బందిపడిందని వితిక తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భీకరుల పోరు.. ఎవరిదో జోరు

ఓవైపు డెవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో, విలియమ్సన్‌.. మరోవైపు విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, ఆరోన్‌ ఫించ్‌. ఒక జట్టులో రషీద్‌ఖాన్‌, భువనేశ్వర్‌కుమార్‌.. మరో జట్టులో యుజ్వేంద్రచాహల్‌, డేల్‌ స్టెయిన్‌. ఈ పేర్లు చాలవా.. నేడు జరగబోయే పోరు ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి. ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్‌, బెంగళూరు జట్ల మధ్య దుబాయ్‌ వేదికగా ఈరోజు సాయంత్రం భీకరపోరు సాగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలేంటో ఓ లుక్కేయండి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సూపర్‌ ఓవర్లు పది.. గెలుపు ఎవరిది?


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.