close

తాజా వార్తలు

Updated : 22/09/2020 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. వచ్చే ఏడాదికి భారత్‌లో వ్యాక్సిన్‌, కానీ..

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాదికి భారత్‌లో అందుబాటులోకి వస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు గగన్‌దీప్ కాంగ్‌ అన్నారు. కాకపోతే 130 కోట్ల మంది భారతీయులకు దాన్ని అందజేయడం అతి పెద్ద సవాలని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ భద్రతకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ అడ్వైజరీ కమిటీలో సభ్యురాలు, వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన గగన్‌దీప్ ఓ మీడియా సంస్థతో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ నిరాహార దీక్ష

ఎంపీల ప్రవర్తనకు నిరసనగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు. వ్యవసాయ బిల్లులపై విపక్ష సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని వాపోయారు. అంతకుముందు.. సస్పెన్షన్‌కు గురై పార్లమెంటు ఆవరణలోనే నిరసనకు దిగిన 8 మంది ఎంపీలకు హరివంశ్‌ తేనీరు అందించారు. ఈ చర్య పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. డిప్యూటీ ఛైర్మన్‌ చర్యల్ని కొనియాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మారితేనే మంచిరోజులు..!

ఏ లక్ష్యాలతో అయితే ఐక్యరాజ్య సమితి(ఐరాస) పురుడు పోసుకుందో వాటిని ఇంకా పూర్తి స్థాయిలో సాధించలేకపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే సంస్థ ‘విశ్వసనీయత సంక్షోభం’లో పడుతోందని.. దాన్ని అధిగమించాలంటే నేటి ఆధునిక సవాళ్లకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశాల్లో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో జనవరి నుంచి భారత్‌ తాత్కాలిక సభ్యదేశంగా చేరనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. డిలీట్‌.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌!

ప్రముఖ చాటింగ్‌ యాప్‌ వాట్సాప్‌ రోజు రోజుకూ సరికొత్త అప్‌డేషన్స్‌తో యూజర్ల ముందుకొస్తోంది. వినియోగ దారుల సమాచార భద్రతే ప్రాధాన్యంగా రకరకాల ఫీచర్లను అందిస్తోంది. ఇప్పటికే అనుమతిలేకుండా ఇతరులు మీ వాట్సాప్ అకౌంట్‌లో లాగిన్‌ అవ్వకుండా ఫింగర్‌ ప్రింట్‌ ఆప్షన్‌ను అందుబుటులోకి తెచ్చిన వాట్సాప్‌.. మరిన్ని ఫీచర్ల కోసం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే వాట్సాప్‌లో పొరపాటున పంపిన వీడియోలను, టెక్స్‌మెస్సేజ్‌లు, ఇమేజ్‌లు, ఫైల్స్‌, ఎమోజీలను ఇలా ఏదైనా నియమిత సమయంలో అవతలి వాళ్ల అకౌంట్ నుంచి కూడా డిలీట్‌ చేసే అవకాశం ఇప్పటికే ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రికవరీల్లో రికార్డ్‌: 24గంటల్లో లక్ష మంది..

భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా నిత్యం 90వేలకుపైగా బాధితులు కోలుకొని డిశ్చార్జి అవుతున్నారు. అయితే నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో లక్ష మంది(1,01,468) కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్‌ బయటపడిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కోలుకోవడం ఇదే మొదటిసారి. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 9 లక్షలకు పడిపోయింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అన్నీ దొంగ లెక్కలే : సీఎల్పీనేత భట్టి

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్ల జాబితా తప్పుల తడకగా ఉందని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా్డుతూ.. నాంపల్లిలో 1,824 ఇళ్లు కట్టామని చెప్పారు, ఒక్క ఇల్లు కూడా కట్టలేదని స్పష్టం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాక్.. మా విషయాల్లో జోక్యం వద్దు: భారత్‌

కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో లేవనెత్తేందుకు పాకిస్థాన్‌ మరోసారి విఫలయత్నం చేసింది. ఐరాసలో చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యల్లో కశ్మీర్‌ సమస్య ఒకటని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే పాక్‌ వాదనను భారత్‌ ఖండించింది. కుట్రలను పక్కన పెట్టి ఉగ్రవాదాన్ని రూపుమాపడంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. ఐక్య రాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్‌ ఖురేషీ వీడియో సందేశాన్నిస్తూ ప్రపంచంలో శాంతిస్థాపన కోసం ఐరాస చేస్తున్న కృషిని కొనియాడారు. ఐరాస విజయాలను ప్రశంసిస్తూ..  కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయని చెప్పారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వాయిదా కట్టాల్సిందే..! 

భారతీ ఎయిర్‌టెల్‌ , వొడాఫోన్‌ ఐడియా సంస్థలు మార్చి చివరి నాటికి  తమ అడ్జెస్ట్‌డు గ్రాస్‌ రెవెన్యూ ఛార్జీల్లో 10శాతం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌కు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ సంస్థలకు ఇది మరో తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మరోపక్క సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు చాలా సూటిగా ఉన్నాయని వీటిల్లో ఎటువంటి గందరగోళం లేదని డీవోటీ అభిప్రాయపడుతోంది.  అంటే వొడాఫోన్‌ రూ.5,825 కోట్లు, ఎయిర్‌టెల్‌ రూ.4,398 కోట్లు చెల్లించాల్సి ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. డ్రగ్స్‌ కేసులో దీపికకు సమన్లు?

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతిపై జరుగుతున్న విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. దీనిలో డ్రగ్స్‌ కోణాన్ని దర్యాప్తు చేసేందుకు నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్‌ నటీనటుల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెకు కూడా మాదక ద్రవ్యాల వినియోగం కేసులో ఎన్సీబీ సమన్లు ఇవ్వనున్నట్టు సమాచారం. అంతేకాకుండా శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లకు కూడా సమన్లు జారీ అవుతాయని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పడి..పడి.. దంచికొట్టే పడిక్కల్‌

వయసు 20 ఏళ్లు.. ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు.. ఎడమచేతివాటం.. బంతిని బౌండరీ సరిహద్దులు దాటించగల భుజ బలం.. పరుగుల వరద పారించాలన్న మనస్తత్వం.. బౌన్సర్లకు భయపడని ఆత్మవిశ్వాసం.. కెరీర్‌లో నిలదొక్కుకోవాలన్న కసి.. అన్నీ కలిస్తే యువ క్రికెటర్‌ ‘దేవదత్‌ పడిక్కల్‌’. సన్‌రైజర్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్లతో యువరాజ్‌ సింగ్‌ను గుర్తుకుతెచ్చిన అతడి విశేషాలు మీ కోసం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.