close

తాజా వార్తలు

Published : 26/09/2020 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. బాలూ.. మొదటిసారి మరణం ఒంటరైంది..!

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో సినీలోకం శోకసంద్రంలో మునిగింది. కరోనా నుంచి ఇటీవల కోలుకున్న ఆయన ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఎంజీఎం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఎస్పీబీ మరణవార్త విని సినీలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. బాలుతో తమకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సుకుమార్‌, పరశురామ్‌ సోషల్‌మీడియా వేదికగా బాలుకి కన్నీటి నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

డోలీవాలాల పాదాలకి మొక్కిన ఎస్పీబీ..!

2. ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీబీ అంత్యక్రియలు

 సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు జరిగాయి. కొవిడ్‌ నేపథ్యంలో నిన్న రాత్రే బాలు పార్థీవదేహాన్ని చెన్నై శివారులోని తామరైపాక్కంలో ఉన్న ఎస్పీబీ వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. ఇవాళ ఉదయం అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఒక్క డోసులో టీకా..ఆశాజనకంగా ఫలితాలు

ఒకే ఒక్క డోసుతో కొవిడ్‌-19 నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యమున్న టీకాను అభివృద్ధి చేస్తున్న అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్ జాన్సన్‌ సంస్థ మరో ముందడుగేసింది. ఇప్పటికే  ప్రభుత్వ అనుమతితో 1000 మంది వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించగా ఉత్తమ ఫలితాలు వచ్చాయి. దీంతో బుధవారం మానవులపై తుది దశ ప్రయోగపరీక్షలు ప్రారంభం కాగా.. అందులోనూ ఫలితాలు ఆశాజనకంగా వస్తున్నట్లు సంస్థ మధ్యంతర ఫలితాలను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 24 గంటల్లో 85,362 కేసులు.. 1,089 మరణాలు

భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,41,535 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 85,362 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 59,03,933కి చేరింది. వీరిలో 9,60,696 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 48,49,585 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 1,089 మంది మహమ్మారికి బలయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు

5. ఉభయదేవేరులతో శ్రీ మలయప్పస్వామి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శనివారం ఉదయం ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వై.వి సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, పలువురు అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చీరకట్టి.. రింగుతో చిందేసి

ఓ డ్యాన్సర్‌ చీరకట్టుతో చేసిన రింగు డ్యాన్స్‌ సామాజిక మాధ్యమాలను ఊపేస్తోంది. ఆమె స్టన్నింగ్‌ పెర్ఫార్మెన్స్‌‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సాధారణంగా రింగుతో డ్యాన్స్ అంటే దానికి తగిన దుస్తులు ధరిస్తారు. అయినా డ్యాన్స్‌ చేయడం కష్టమే. అలాంటిది సంప్రదాయ చీరకట్టు, రన్నింగ్‌ బూట్లతో ఆమె ప్రదర్శన‌కు నెటిజన్లు ఔరా అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏడు దశాబ్దాల్లో పాక్‌ వెలగబెట్టిందిదే..!

ఏడు దశాబ్దాల చరిత్రలో ఉగ్రవాదం, మైనారిటీలపై దాడులు, దొంగచాటు అణు వ్యాపారాలు తప్ప పాకిస్థాన్‌ వెలగబెట్టిందేమీ లేదని భారత్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నత స్థాయి అంతర్జాతీయ వేదికపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మన దేశ అంతర్గత విషయాలను ప్రస్తావించడంపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే వేదికగా పాక్‌ చరిత్రను బట్టబయలు చేసింది. ప్రధానిగా ఇమ్రాన్‌ వెలగబెట్టిన కార్యాల్ని ఎండగట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌లో కొత్త ఫోన్లు..

రెడ్‌మీ మధ్యశ్రేణి మార్కెట్‌ లక్ష్యంగా ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త ఫోన్లను తీసుకురానుంది. రెడ్‌మీ నోట్ 10 పేరుతో కొత్త సిరీస్‌లో వీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. గౌగ్విన్‌, గౌగ్విన్‌ ప్రో పేరుతో గతంలో షావోమి వీటిని రిజిష్టర్‌ చేసిందట. తాజాగా ఈ ఫోన్లను షావోమి ఎంఐ 10టీ సిరీస్‌ పేరుతో చైనాతో పాటు ఇతర మార్కెట్లో సెప్టెంబరు 30 తేదీన విడుదల చేయనుంది. భారత్‌లో రెడ్‌మీ  బ్రాండ్‌కు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ బ్రాండ్ కింద రెడ్‌మీ నోట్ 10, నోట్ 10 ప్రో పేరుతో వీటిని తీసుకొస్తున్నారట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరైన దీపికా పదుకొణె

బాలీవుడ్‌ ప్రముఖ నటి దీపికా పదుకొణె మాదకద్రవ్యాల కేసులో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ముంబయిలోని పోర్ట్‌ ట్రస్ట్‌ అతిథిగృహంలో అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. గోవాలో ఉన్న నటి భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి గురువారం ముంబయికి చేరుకున్నారు. శనివారం ఉదయం 9.45 గంటలకి ఆమె విచారణకు హాజరయ్యారు. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం అనంతరం బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన మాదకద్రవ్యాల కేసులో అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చెన్నైని బాధించే 5 ఓటముల కథ

ఆటలో గెలుపోటములు అత్యంత సహజం. కొన్ని విజయాలు ఆటగాళ్లలో గర్వం పెంచితే కొన్ని ఓటములు అంతులేని బాధను మిగిలిస్తాయి. మర్చిపోదామన్నా పదేపదే గుర్తొస్తుంటాయి. మూడుసార్లు విజేత చెన్నైకీ ఈ నిర్వేదం తప్పలేదు. 13వ సీజన్‌లో దిల్లీ చేతుల్లో పరాజయమూ ఇలాంటిదే. ధోనీ సేనను అత్యంత బాధించే అపజయాలు ఐదున్నాయి. అవేంటంటే..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రైనా.. మళ్లీ రావా..!


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.