close

తాజా వార్తలు

Published : 30/09/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. బాబ్రీ మసీదు కేసు: వారంతా నిర్దోషులే..!

ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు ఎట్టకేలకు తెరపడింది. మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ(92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి సురేంద్ర కుమార్‌ యాదవ్‌ తీర్పును వెల్లడించారు. విచారణలో భాగంగా 351 మంది సాక్షులను సీబీఐ విచారించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మరో దారుణం..!

సామూహిక అత్యాచారానికి గురై.. తీవ్ర గాయాలతో పదిరోజులకు పైగా మృత్యువుతో పోరాడి ఓడిపోయిన యువతికి న్యాయం చేసే విషయంలో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉంది. ఆమె మృతదేహాన్ని దిల్లీలోని ఆసుపత్రి నుంచి నేరుగా హాథ్రస్‌కు తరలించి అక్కడే అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు మృతురాలి రక్తసంబంధీకులను కూడా అనుమతించలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎప్పటిలానే పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ టీకా వృద్ధులకూ పనిచేస్తోంది..!

మోడెర్నా టీకా ప్రయోగాల్లో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. వృద్ధుల్లో కూడా వైరస్‌ను చంపే యాంటీబాడీలను ఈ టీకా తయారు చేస్తోందని తేలింది. ఈ యాంటీబాడీల స్థాయి కూడా యువతలో ఉన్నంతే ఉంటున్నట్లు సమాచారం. ఫ్లూషాట్‌ హైడోస్‌లో ఉన్నంత స్థాయిలోనే సైడ్‌ఎఫెక్టులు కూడా ఉన్నట్లు పరిశోధకులు మంగళవారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 24గంటల్లో 80వేల కేసులు, 1179 మరణాలు!

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ముందురోజు కేసులు, మరణాల సంఖ్య తగ్గినప్పటికీ తాజాగా ఆ సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24గంటల్లో 80,472 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 62,25,763కు చేరింది. వీరిలో ఇప్పటికే 51,87,826 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 86,428 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 2,103 కరోనా కేసులు

5. WW2:జర్మనీపై బ్రిటన్‌ ‘ఎలుక బాంబు’ ప్రయోగం

మొదటి, రెండో ప్రపంచయుద్ధాల్లో అనేక దేశాలు పాల్గొని శత్రుదేశాలపై విజయం సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఇందులో భాగంగా ఆధునిక యుద్ధ యంత్రాలను వినియోగించాయి.. వినూత్న వ్యూహాలను అమలు చేశాయి. ఈ క్రమంలోనే జర్మనీని దెబ్బతీయాలని బ్రిటన్‌ ‘ఎలుక బాంబు’ల వ్యూహం రచించింది. అది ఫలించలేదు గానీ.. జర్మనీ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. రెండో ప్రపంచయుద్ధం సమయంలో బ్రిటన్‌కు స్పెషల్‌ ఆపరేషన్‌ ఎగ్జ్‌క్యూటీవ్‌(ఎస్‌వోఈ) బృందం ఒకటి ఉండేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నెటిజన్లపై సల్మాన్‌ సోదరుడు పరువు నష్టం దావా..!

తన గురించి, తన కుటుంబసభ్యుల గురించి అసత్య ఆరోపణలు చేస్తూ పలు సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ వేదికగా పోస్టులు పెడుతున్నారంటూ కొంతమంది నెటిజన్లపై సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ పరువు నష్టం దావా వేశారు. ఇటీవల మృతిచెందిన బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌, ఆయన మేనేజర్‌ దిశా ఆత్మహత్యలతో అర్బాజ్‌ ఖాన్‌కి సంబంధముందంటూ గత కొన్నిరోజులు నుంచి విభోర్ ఆనంద్, సాక్షి భండారితోపాటు మరికొంతమంది నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు, వీడియోలు, ఫొటోలు పోస్ట్‌ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అక్టోబరు 4నే సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష

అక్టోబరు 4న జరగనున్న సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఈమేరకు సుప్రీంకోర్టుకు యూపీఎస్సీ అఫిడవిట్‌ సమర్పించింది. ఈ ఏడాది వాయిదా వేస్తే ఆ ప్రభావం వచ్చే ఏడాది జూన్‌ 27న జరిగే పరీక్షపై పడుతుందని పేర్కొంది. పరీక్షకు హాజరయ్యే వారంతా పట్టభద్రులు, ఆపైబడిన వారేనని.. వారంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్టు అఫిడవిట్‌లో తెలిపింది. కొవిడ్‌ సహా అన్ని ప్రొటోకాల్స్‌ పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బైడెన్‌ vs ట్రంప్ ‌: ‘పుతిన్‌ పప్పీ’.. ‘నోరు ముయ్‌’

అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంగళవారం అధ్యక్ష అభ్యర్థుల తొలి బహిరంగ చర్చ జరిగింది. కొవిడ్‌-19 నియమాల ప్రకారం కరచాలనం చేయకుండానే కార్యక్రమం మొదలైంది. ‘‘హౌ ఆర్‌ యూ, మేన్‌?’’ అంటూ డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ అధ్యక్షుడు ట్రంప్‌ను పలకరించారు. అయితే కరోనా వైరస్‌, తదితర కీలక అంశాల గురించి చర్చించే క్రమంలో ఇద్దరూ కత్తులు దూసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘యమలీల’ కోసం అందరినీ వదులుకున్నా!

తనలో ఉన్న నటుడికి తెలుసు.. నటనతో మాయ చేసే ‘మాయలోడు’డని.. తనలో ఉన్న సంగీత దర్శకుడికి తెలుసు.. తన సంగీతంతో ప్రేక్షకుల హృదయాలను ఊపేయగలడని.. తనలో ఉన్న కథా రచయితకు తెలుసు తన కథలతో సకుటుంబ సపరివార సమేతంగా మెప్పించగలడని.. తనలోని నిర్మాతకు తెలుసు..  బడ్జెట్‌ పద్మనాభమని.. తనలో ఉన్న దర్శకుడికి తెలుసు.. సినిమా అంటే ఇవన్నీ కలిసి ఉండే ‘ఉగాది’ అని.. ఆఫ్‌ స్క్రీన్‌లో అన్ని క్యారెక్టర్లు చేసే ఆయన స్క్రీన్‌పై మాత్రం స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, ‘ఎగిరే పావురం’లా శాంతంగా ఉంటారు. ఆయనే దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదాగా సంగతులు పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టాస్‌ ఓడినా గెలిచినందుకు సంతోషం

టాస్‌ ఓడినప్పటికీ మ్యాచ్‌ గెలిచినందుకు సంతోషంగా ఉందని హైదరాబాద్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. రషీద్‌ ఖాన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని ప్రశంసించాడు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌ సహా అన్ని విభాగాల్లో తమ జట్టు రాణించిందని పేర్కొన్నాడు. దిల్లీపై విజయం తర్వాత అతడు మాట్లాడాడు. అబుదాబి వేదికగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌, దిల్లీ తలపడ్డాయి. టాస్‌ గెలిచిన శ్రేయస్‌ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.