టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM
close

తాజా వార్తలు

Published : 30/10/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. తీరు మారకుంటే రాబోయేది మహమ్మారుల శకమే!

అంటువ్యాధుల్ని అరికట్టే విషయంలో ప్రపంచ దేశాల విధానాల్లో మార్పులు రాకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన మహమ్మారుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఓ అంతర్జాతీయ నివేదిక హెచ్చరించింది. ప్రకృతి విధ్వంసానికి.. మహమ్మారుల ఆవిర్భావానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే మహమ్మారుల శకాన్ని తప్పించుకోవడానికి ఉన్న మార్గాలనూ సూచించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ సైన్స్‌ పాలసీ ప్లాట్‌ఫామ్‌ ఆన్‌ బయోడైవర్సిటీ అండ్‌ ఎకోసిస్టం సర్వీసెస్‌’(ఐపీబీఈఎస్‌) అత్యవసర వర్క్‌షాప్‌ నిర్వహించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘పుల్వామా’పై మాట మార్చిన పాక్‌ మంత్రి

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తమ పనే అని అంగీకరించిన దాయాది దేశం పాకిస్థాన్‌ ఇప్పుడు మళ్లీ మాట మార్చింది. ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని.. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని పాక్‌ శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి ఫవాద్‌ చౌధురి తాజాగా చెప్పడం గమనార్హం. పుల్వామా దాడి తర్వాత పరిస్థితుల గురించే తాను ప్రస్తావించానంటూ ఫవాద్‌ బుకాయించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘పాక్‌ సేనల్ని తుడిచిపెట్టేద్దామనుకున్నాం’

బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా పాకిస్థాన్‌ చేసిన సైనిక దుస్సాహసం విజయవంతమై ఉంటే.. దాయాది సైనిక విభాగాల్ని తుడిచిపెట్టేద్దామనుకున్నామని నాటి వైమానిక దళాధిపతి బి.ఎస్‌.ధనోవా తెలిపారు. అందుకు భారత సేనలు అప్పటికే సిద్ధమయ్యాయని వెల్లడించారు. నాటి వైమానిక దాడుల్లో పాక్‌కు బందీగా పట్టుబడిన ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ అప్పగింతకు ముందు ఆ దేశ నాయకులు వణికిపోయారని వచ్చిన వార్తల నేపథ్యంలో ధనోవా స్పందించారు. వర్ధమాన్‌ను అప్పగించడం తప్ప అప్పుడు పాక్‌కు మరో మార్గం లేదని స్పష్టం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బైడెన్‌ వస్తే అమెరికా మరో వెనిజులా: ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విమర్శలు, ప్రతి విమర్శల తీవ్రత పెరిగిపోతోంది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాటిక్‌ అభ్యర్థి బైడెన్‌ మధ్య మాటల యుద్ధం హద్దులు మీరుతోంది. అధ్యక్ష అభ్యర్థులు హుందాగా ప్రవర్తించడం పోయి.. స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారని ఇప్పటికే విమర్శలు రేగాయి.  చాలాసార్లు వీరిద్దరి వాదప్రతివాదనలు వ్యక్తిగత విమర్శల వరకూ వెళ్లాయి. కాగా,  తాజాగా ట్రంప్‌ మరోసారి నోరుపారేసుకున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పేద దేశాలకు కొవిడ్‌ వ్యాక్సిన్ ‌బీమా..

కొవిడ్‌ వ్యాక్సిన్ల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఏవైనా దుష్ప్రభావాలు పడితే.. వారికి తగిన వైద్య సహాయం అందేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఓ కొవిడ్ బీమా పథకాన్ని ప్రకటించారు. ఇందుకుగాను ‘కోవాక్స్’‌ ప్రమోటర్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ‘గావి’ సంయుక్తంగా ఓ సహాయక నిధిని ఏర్పాటు చేసినట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు సమానంగా అందించడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో కోవాక్స్‌ కూటమి ఏర్పాటైన సంగతి తెలిసిందే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భారత్‌లో 6 లక్షల దిగువకు యాక్టివ్‌ కేసులు

6. రిటర్నుల సమర్పణకు సిద్ధమయ్యారా? 

పరిమితికి మించిన ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలిందే. 2019-20 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2020-21) రిటర్నులు దాఖలు చేయడానికి డిసెంబరు 31, 2020 వరకూ సమయం ఉంది. ఇంకా చాలా సమయం ఉంది కదా.. అని అనుకోవచ్చు. కానీ, చివరి నిమిషం వరకూ ఎదురు చూడకుండా.. ముందే రిటర్నులు దాఖలు చేస్తే మేలు కదా..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆలస్యం విలువ రూ.7.4లక్షల కోట్లు 

యాపిల్‌ తురుపు ముక్క ఐఫోన్‌ ఆ సంస్థకు లాభాలనే కాదు.. అప్పుడప్పుడు మార్కెటు విలువను హారతి కర్పూరం చేసి ఝలక్‌ కూడా ఇస్తుంది. అంటే ఆ ఫోన్‌ పనితీరుతో కాదు.. కేవలం అనుకున్న సమయానికి మార్కెట్లోకి రావడం ఆలస్యమైనా ఆ ప్రభావం యాపిల్‌ మార్కెట్‌ విలువపై తీవ్రంగానే పడుతోంది. తాజాగా ఐఫోన్‌ 12.. కరోనా ప్రభావం కారణంగా అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యమైంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సవాళ్ల నడుమ నితీశ్‌ ప్రగతి మంత్రం!

బిహార్‌ తొలి దశ ఎన్నికల్లో భాగంగా 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓవైపు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే.. రెండు, మూడో దశ ప్రచారంలో అటు ఎన్‌డీఏ, మహాకూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అయితే, ఇప్పటివరకు అభివృద్ధి, సుపరిపాలన పేరుతోనే గడిచిన దశాబ్ద కాలంగా నితీశ్‌ కుమార్‌ రాష్ట్రాన్ని పాలించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గత 15ఏళ్లలో బిహార్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నితీశ్‌ పాలించారని ప్రచారంలో పేర్కొంటున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సాయిపల్లవి లక్కీఛాన్స్‌ కొట్టేశారా?

నటీనటులు సాయిపల్లవి-నితిన్‌ లక్కీఛాన్స్‌ కొట్టేశారా?అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఓ సినిమాలో వీరిద్దరూ కీలకపాత్రలు పోషించే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ‘తెలుగు సినిమా అభిమాన పోలీస్‌ ఈజ్‌ బ్యాక్‌ ఇన్‌ ఏ హై ఓల్టేజ్‌ రోల్‌’ అని పేర్కొంటూ పవన్‌కల్యాణ్‌ కొత్త సినిమా గురించి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అభిమానులతో ఓ ప్రత్యేక వీడియోని పంచుకున్న విషయం తెలిసిందే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కరోనా వల్ల రుతురాజ్‌ను అంచనా వేయలేకపోయాం 

కరోనా కారణంగా యువ బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయామని చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ అన్నాడు. గతరాత్రి కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో రుతురాజ్‌(72) అర్ధ శతకంతో రాణించగా జడేజా(31*) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. దీంతో కోల్‌కతా తప్పక గెలవాల్సిన పోరులో ఓటమిపాలైంది. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన ధోనీ రుతురాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే చివర్లో తమకు కలిసి వచ్చిందని చెప్పాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ధోనీని ఔట్‌ చేసి.. అతడి నుంచే సలహాలు!!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని