close

తాజా వార్తలు

Published : 21/09/2020 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. రాజ్యసభలో రణరంగం

వ్యవసాయ బిల్లులను ఆమోదింపచేసుకునేందుకు అధికార పక్షం, వ్యతిరేకించేందుకు విపక్షాలు మోహరించడంతో ఆదివారం రాజ్యసభలో యుద్ధ వాతావరణం నెలకొంది. బిల్లులపై చర్చ సందర్భంగా సభ రణరంగాన్ని తలపించింది. ఒకదశలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డెరెక్‌ ఓబ్రియెన్‌ ఆవేశంగా పోడియం వద్దకు దూసుకువచ్చి, సభా నిబంధనల పుస్తకాన్ని  డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ మీదికి విసిరారు. కోపంగా బిల్లు ప్రతుల్ని చించి విసిరేయడంతోపాటు మైకుల్ని బలవంతంగా లాక్కోవాలని చూశారు. ఈ ప్రయత్నాలను మార్షల్స్‌ వమ్ము చేశారు. అరుపులు, కేకలు, వాగ్వాదాల నడుమ ఈ బిల్లులు మూజువాణి ఓటుతో సభామోదం పొందినట్లు హరివంశ్‌ ప్రకటించారు. సభ ముగిశాక డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి 12 విపక్ష పార్టీలు నోటీసు ఇచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చట్టం ఒప్పుకోదు!

అమరావతిలో అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తామని మాటిచ్చి, ప్రత్యేకంగా చట్టం చేసి రైతుల దగ్గర నుంచి భూములు సమీకరించాక.. దానికి విరుద్ధంగా ప్రభుత్వం ముందు కెళ్లడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.  నవనగరాలతో కూడిన రాజధాని కడతామని చట్టబద్ధంగా విశ్వాసం కల్పించి.. అసెంబ్లీ మాత్రమే ఉండే నామమాత్రపు రాజధానినే మిగుల్చుతామనడం ఆ చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెబుతున్నారు. అన్ని హంగులతో రాజధాని నిర్మిస్తామన్న చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘించి.. మూడు రాజధానులని కొత్త పల్లవి ఎత్తుకోవడం చట్టప్రకారం చెల్లదని విశ్లేషిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇందులో రహస్యం ఏముంది?

3. టీకాల్లో తెలంగాణ భేష్‌

సమగ్ర టీకాల అమలులో తెలంగాణ మంచి పనితీరును కనబరుస్తోంది. ఈ ఏడాది ఆగస్టునాటికి చిన్నారులకు టీకాలను అందించడంలో 87.7 శాతంతో మన రాష్ట్రం జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. టీకాల అమలులో జమ్మూ-కశ్మీర్‌ 98.3 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, రెండోస్థానంలో మేఘాలయ(89.7శాతం) నిలిచింది. తెలంగాణలో 3,63,026 మంది చిన్నారులకు ఆగస్టు నాటికి టీకాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 3,58,333(65.3 శాతం) మందికి టీకాల అమలు జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వరద.. వణుకు

 తెరిపినిచ్చినట్లే ఇచ్చి వాన దంచికొడుతోంది. ఆదివారం కూడా నగరవ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ ఉక్కిరిబిక్కిరయ్యాయి. ప్రధాన రహదారులపై వరద ఉద్ధృతిగా ప్రవహించింది. రోడ్లు, నాలాలు ఏకమయ్యాయి. ఎల్‌బీనగర్‌ జోన్‌లోని అనేక ప్రాంతాల్లో అడుగు వేయలేని పరిస్థితి కనిపించింది. చింతల్‌కుంట వద్ద నడుములోతు నీళ్లు రావడంతో వాహనాలు మునిగాయి. జాతీయ రహదారిపై వనస్థలిపురం పనామా కూడలి చెరువును తలపించింది. అబిడ్స్‌ నియాజ్‌ఖానా బస్తీలో 150 నివాసాల్లోకి నీరు వచ్చింది. బీఎన్‌రెడ్డినగర్‌లో సాగర్‌ రహదారి కుంగిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

5. గుడ్డు @ 6

 కోడి గుడ్డు ధర పెరిగింది. ఒక్కోటి చిల్లర ధర రూ.6 చొప్పున పలుకుతోంది. రాష్ట్రంలో గుడ్ల ఉత్పత్తి 50% వరకు తగ్గిపోవడం, కరోనా నేపథ్యంలో స్థానిక వినియోగం పెరగడం ప్రధాన కారణాలుగా పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్‌ వ్యాప్తి తొలినాళ్లలో అపోహల వల్ల మాంసం, గుడ్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో పౌల్ట్రీ నిర్వాహకులు కోళ్లను కొనేవారు లేక, వాటిని పోషించలేక చేతులెత్తేశారు. గుడ్లనూ నష్టాలకు విక్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. మరో మల్లీశ్వరి రావాలి

విభాగంలో పోటీలు జరుగుతున్నాయి.. పతకమే లక్ష్యంగా బరిలో దిగిన తెలుగమ్మాయి మొత్తం 240 కిలోల బరువెత్తి (స్నాచ్‌లో 110, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 130 కేజీలు) కాంస్యం సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. పోడియంపై నిల్చుని త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన ఆ వీర వనిత పేరు.. కరణం మల్లీశ్వరి. ఏపీలోని శ్రీకాకులం జిల్లాలోని ఓ చిన్న గ్రామం నుంచి.. ఒలింపిక్స్‌లో పతకం వరకూ చేరిన ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఆ అద్భుతం జరిగి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెబినార్‌లో మాట్లాడుతూ ఆమె ఎన్నో విశేషాలు పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. సైన్యం కళ్లు కప్పి.. బంకర్లలో దాగి!

జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదులు.. తమను వెంటాడుతున్న సైనికుల నుంచి తప్పించుకోవడానికి కొండ ప్రాంతాలకు వెళ్లడం, స్థానికుల ఇళ్లలో ఆశ్రయం పొందడం పాత పద్ధతి. దట్టమైన పండ్ల తోటలు, కాలానుగుణంగా ప్రవహించే జల ప్రవాహాల నడుమ భూగర్భంలో బంకర్లు ఏర్పాటు చేసుకొని సైన్యం, భద్రతా దళాల కళ్లుకప్పడం నేటి పద్ధతి. ఈ విధంగా ఉగ్రవాదులు బంకర్ల సాయంతో రోజుల తరబడి దాక్కుంటున్నారని సైనిక ఉన్నతాధికారి కర్నల్‌ ఏకే సింగ్‌ తెలిపారు. ఇటీవల తనిఖీల్లో బయటపడిన బంకర్ల గురించి ఆదివారం ఆయన  వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. టీవీల ధరలు పెరగక తప్పదా?

ఎల్‌ఈడీ టీవీల తయారీ కోసం వినియోగించే ఓపెన్‌సెల్‌పై అక్టోబరు 1 నుంచి కస్టమ్స్‌ సుంకం 5 శాతం అమలు కానుంది. 2017 డిసెంబరు నుంచి టీవీ విడిభాగాలపై 20 శాతం కస్టమ్స్‌ సుంకం అమలవుతోంది. అయితే ఓపెన్‌సెల్‌ తయారీ దేశీయంగా చేపట్టేవరకు, దిగుమతికి అంగీకరించాలని పరిశ్రమ అభ్యర్థించడంతో, 2020 సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. గడువు ముగుస్తున్నందున, అక్టోబరు 1 నుంచి ఓపెన్‌సెల్‌పైనా గతంలో ప్రకటించినట్లు 5 శాతం కస్టమ్స్‌ సుంకం అమలవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. కూలిన మూడంతస్తుల భవనం..8 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో కనీసం 8 మంది మృతి చెందారు. ఈ ఘటన భీవండిలోని పటేల్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. మరో 20-25 మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు థానె మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఓ 25 మందిని స్థానికులు సురక్షితంగా కాపాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. అంపైర్‌ పొరపాటు.. పంజాబ్‌కు గ్రహపాటు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు రెండో రోజే సూపర్‌ కిక్కు వచ్చేసింది. అనుకోని రీతిలో కింగ్స్‌ XI పంజాబ్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీయడంతో అభిమానులు ఒక్కసారిగా థ్రిల్లయ్యారు. అయితే అంపైర్‌ తప్పిదం వల్లే పంజాబ్‌ ఓటమి పాలైంది! దీంతో ఆ జట్టు యాజమాన్యం ఐపీఎల్‌ పాలక మండలికి ఫిర్యాదు చేసి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మొదట బ్యాటింగ్‌ చేసి దిల్లీ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కష్టతరమైన పిచ్‌పై ఛేదనలో పంజాబ్‌కు శుభారంభం లభించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

* సూపరో సూపర్‌


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.