close

తాజా వార్తలు

Updated : 26/09/2020 09:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. స్వరాభినిష్క్రమణం

సుప్రసిద్ధ గాయకుడు.. బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం తుది శ్వాస విడిచారు. స్వల్ప కరోనా లక్షణాలతో ఆయన ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చేరారు. చిన్నపాటి లక్షణాలే ఉన్నాయి తప్ప, తనకెలాంటి సమస్యలు లేవని, ఎవరూ ఆందోళన చెందవద్దని తొలి రోజు స్వయంగా వీడియో ద్వారా తెలియజేశారు బాలు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమించింది. వెంటిలేటర్‌, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తూ వచ్చారు. తమ అభిమాన గాయకుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు ప్రార్థనలు నిర్వహించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మాటేరాని మౌనమిది

2. భాగ్యనగర మణికిరీటం..

 భాగ్యనగరానికి తీగల వంతెన మణికిరీటం లాంటిదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. దుర్గం చెరువుపై రూ.184 కోట్లతో చేపట్టిన నిర్మాణాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.45లో మొదలై తీగల వంతెనకు అనుసంధానమైన 1.7 కి.మీ పొడవుగల 4 వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌కూ పచ్చజెండా ఊపారు. రూ.150 కోట్లతో దీనిని నిర్మించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పల్లవించవా మా గొంతులో...

70ల్లో పుట్టిన ఓ కుర్రాడికి ఏడెనిమిదేళ్లొచ్చాయ్‌. తొలిసారిగా థియేటర్‌కెళ్లి సినిమా చూశాడు. అది ఎన్టీఆర్‌ సినిమా. కాసేపటికి పాటొచ్చింది. ‘‘అబ్భా. ఎంత బావుందో! ఎన్టీవోడికి పాటలు పాడటం కూడా వచ్ఛా. భలే పాడుతున్నాడే’’ అని మనసులోనే అనుకున్నాడు. తర్వాత ఏఎన్నార్‌ సినిమాకెళ్లాడు. ఆయన కూడా మంచి పాటగాడే అనిపించింది చూస్తుంటే. ఇంకొన్ని రోజులకు చిరంజీవి సినిమా చూశాడు. అందులోనూ పాటలు సూపర్‌. చిరంజీవి పాటలు పాడటంలో తక్కువోడు కాదనుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌, మోహన్‌ బాబు, రాజశేఖర్‌.. ఇలా ఒక్కొక్కరి సినిమాలు చూస్తున్నాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కష్టాలు దాటింది... కన్నీళ్లు తుడుస్తోంది!

ఓ చేతిలో కడుపులోని బిడ్డ స్కానింగ్‌ రిపోర్టు... మరో చేతిలో విడాకుల పత్రాలు. సరిగ్గా ఏడేళ్ల కిందట దివ్యారెడ్డి పరిస్థితి ఇది. ‘నేనెందుకు బతకాలి?..’ అని పదేపదే ప్రశ్నించుకున్న దివ్యకి సమాధానం కూడా ఆ ప్రశ్నలోనే దొరికింది. బిడ్డకోసం, తనను తాను నిరూపించుకోవడం కోసం. ఓ పక్క ‘అంతర్జాతీయ డిజైనర్‌’గా రాణిస్తూనే... మహిళల కోసం ‘హెర్‌ రైట్‌’ అనే స్వచ్ఛంద సంస్థనీ స్థాపించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పాటకు మణిమకుటం!

‘నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ... నా పాట పంచామృతం’ అంటూ అనితర సాధ్యంగా అయిదున్నర దశాబ్దాలపాటు బాలసుబ్రహ్మణ్యం చేసిన స్వరాభిషేకం ముగిసింది. ఉచ్ఛ్వాసం కవనం, నిశ్వాసం గానమై 16 భాషల్లో నలభైవేల పాటల పూదోటగా తన సుస్వర పేటికను మలచి నవ పారిజాతాల్ని విరబూయించిన గాన గాంధర్వం మూగవోయింది. శ్రీపతి పండితారాధ్యుల వారి అబ్బాయి శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్నతో మొదలుపెట్టి పాటశాలలో నిత్య విద్యార్థిగా ఎదిగి దిగ్దంత సంగీత స్రష్టల ముద్దు బిడ్డడై ఒదిగి భారతీయ సినీ నేపథ్యగానానికి మణిమకుటమై భాసించిన వైనం అచ్చెరువు గొలుపుతుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరువలేని మహా మనీషి

6. గానమే నీదని... ప్రాణమే గానమని..

సంగీత సామ్రాట్టు బాలమురళీకృష్ణ బాలసుబ్రహ్మణ్యానికిచ్చిన కితాబిది! శంకరాభరణం విన్నవారెవరికైనా బాలు సంగీతం నేర్చుకోలేదంటే నమ్మలేం! కానీ సంగీతం నేర్చుకోకుండానే సినీ ప్రపంచంలో అడుగుపెట్టిన బాలు పట్టుదలతో, సాధనతో ఏ పాటనైనా అలవోకగా పాడే నైపుణ్యం సాధించారు. ప్రతి పాటనూ తపస్సులా చేసేవారు. బాలూ అరంగేట్ర దశలో... తమిళంలో అప్పటికే లబ్ధ ప్రతిష్ఠుడైన గాయకుడు టి.ఎస్‌.సౌందర్‌రాజన్‌! ఆయనంటే అందరికీ హడల్‌! ఒకరోజు సౌందర్‌రాజన్‌, బాలు ఒకే స్టూడియోలో రికార్డింగ్‌ చేస్తున్నారు. ముందు సౌందర్‌రాజన్‌ పాటైంది. తర్వాత వంతు బాలుది. ఆ తర్వాత మళ్ళీ సౌందర్‌రాజన్‌ది ఇంకోపాటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పరువు కోసం కిరాయి హత్య

తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాడు మిర్యాలగూడలో ప్రణయ్‌ను మామ మారుతీరావు సుపారీ ఇచ్చి తుదముట్టించిన రీతిలోనే  హైదరాబాద్‌లో గురువారం మరో పరువు హత్య జరిగింది. తమకు ఇష్టం లేకుండా కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అల్లుణ్ని కిరాయి మనుషులతో హత్య చేయించాడో తండ్రి. కుట్రలో భాగంగా తొలుత అమ్మాయి కుటుంబసభ్యులు వచ్చి మాట్లాడుకుందాం రండని నవదంపతులను నమ్మించారు. వారిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుండగా వాహనాలు వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే దారికి మళ్లాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రేమే నేరమా.. పరువే ముఖ్యమా?

8. ఇక మద్యం మాల్స్‌

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మద్యం మాల్స్‌ రానున్నాయి. ‘వాక్‌ ఇన్‌ షాప్స్‌’ పేరిట వీటిని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇవి ఉన్నతశ్రేణి మద్యం దుకాణాలు. రాష్ట్రంలో 50-100 వరకు ఇలాంటి మాల్స్‌ నెలకొల్పనున్నట్లు సమాచారం. ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో వీటిని ఏర్పాటుచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) వీటిని నిర్వహిస్తుంది. అందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బార్లు ఇక బార్లా..!

9. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి

స్వార్థ రాజకీయ ప్రయోజనాలతోనే ప్రతిపక్షాలు వ్యవసాయ సంస్కరణల బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. రైతులను ఆ పార్టీలు తప్పుదోవ పట్టించటంతో పాటు వారిని అడ్డుపెట్టుకొని తన ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయని ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసమే కేంద్ర ప్రభుత్వం చట్టాలను రూపొందించిందని తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రాయుడు లేకే ఓటమి పాలు: ధోనీ

 అంబటి రాయుడు లేకపోవడంతో ఓటమి పాలవుతున్నామని చెన్నై సారథి ఎంఎస్‌ ధోనీ అంటున్నాడు. అతడు లేకపోవడంతో జట్టు సమతూకం దెబ్బతింటోందని పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తే అంతా సర్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. దిల్లీ చేతిలో ఘోర పరాజయం తర్వాత మహీ మాట్లాడాడు. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చెన్నైకి దిల్లీ పంచ్‌


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.