close

తాజా వార్తలు

Updated : 30/10/2020 09:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ధరణిలోనే సమస్తం

‘‘భూ సంస్కరణల చరిత్రలో ఇదో విప్లవం. ప్రపంచంలోనే సరికొత్త సాంకేతికతకు శ్రీకారం. ఇలాంటి చరిత్రాత్మక ఘట్టానికి మూడుచింతలపల్లి వేదికగా నిలిచింది. 1969 తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచిన వీరారెడ్డి పుట్టిన గడ్డ ఇది. అందుకే ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ధరణి పోర్టల్‌ దేశానికే ట్రెండ్‌ సెట్టర్‌’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పెళ్లివ్యాను బోల్తా: ఏడుగురి మృతి

తూర్పు గోదావరి జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకకు హాజరై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా...వ్యాను అదుపుతప్పి బోల్తాపడటంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ విషాదఘటన జిల్లాలోని గోకవరంలో చోటుచేసుకుంది. రాజానగరం మండలం వెలుగుబందా, గోకవరం మండలం ఠాకూర్‌పాలెంకు చెందిన వధూవరులకు గురువారం రాత్రి తంటికొండ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎలక్ట్రిక్‌ వాహనాలకు రాయితీల బొనాంజా

తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వల కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. కొనుగోళ్లకు పలు రాయితీలను కల్పించింది. నోడల్‌ ఏజెన్సీగా రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన సంస్థ (టీఎస్‌రెడ్‌కో)ను నియమించింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ గురువారం ఉత్తర్వులు (జీవో నెం.12)జారీ చేయగా.. ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి పదేళ్ల కాలానికి తాజా విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘అంటు’కుంటున్నాయ్‌!

రాష్ట్రంలో కొవిడ్‌ కలవరపెడుతూనే ఉంది. కేసుల సంఖ్య ప్రస్తుతానికి తగ్గినా శీతాకాలం నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. మున్ముందు మళ్లీ వైరస్‌ విజృంభించవచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో కాలానుగుణ(సీజనల్‌) వ్యాధుల తీవ్రతా తెలంగాణలో పెరుగుతోంది. గతేడాది జనవరి నుంచి అక్టోబరు 23 నాటితో ఈ ఏడాదిలో ఇదే కాలానికి పోల్చితే ఈ వ్యాధులు తక్కువగా నమోదైనా.. గత ఏడు వారాలను పరిశీలిస్తే వ్యాధుల ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్నట్లుగా వారు విశ్లేషిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈ టీకి లేదు పోటీ

అసోంలో గురువారం నిర్వహించిన వేలంలో మనోహరి గోల్డ్‌ టీ ప్రీమియం తేయాకు పొడి కిలో రూ.75 వేలు పలికింది! ఇలాంటి రికార్డులు ఈ టీకి కొత్తేమీ కాదు. 2018లో కిలో రూ.39,001 ధర పలకగా, గత ఏడాది రూ.50 వేలకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం ‘విష్ణు టీ కంపెనీ’ దీన్ని సొంతం చేసుకుంది. కరోనా కారణంగా మార్కెట్‌ కుదేలయిన తరుణంలో ఇంత మొత్తంలో ధర పలకడం వ్యాపారుల్లో సంతోషాన్ని నింపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమ్మకానికి అక్షయపాత్ర!

దేశ ఆర్థికానికి అవసరమయ్యే నిధులలో ఏటా నాలుగో వంతు భాగాన్ని సమకూరుస్తున్న ఎల్‌ఐసీలో వాటాల విక్రయంవైపు పడుతున్న అడుగులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ ప్రభుత్వ రంగ సంస్థకైనా ప్రభుత్వమే పెట్టుబడి పెట్టాలి. కానీ ఎల్‌ఐసీ ప్రత్యేకత ఏమిటంటే, అది ప్రభుత్వాలకే పెట్టుబడులు అందిస్తోంది! ఎవరైనా సంస్థల ఆస్తుల్ని ఎందుకు అమ్ముకుంటారు? మూలధనం పెంచడానికో, నిర్వహణ పెట్టుబడి అవసరాలకోసమో లేక వ్యాపార విస్తరణకు కావాల్సిన నిధులు సమకూర్చుకోవడానికో సంస్థల్లో వాటాలు విక్రయిస్తారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. టాటాల నుంచి విడిపోవడానికి సిద్ధం

టాటా గ్రూప్‌తో ఉన్న 70 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకునేందుకు  సైరస్‌ మిస్త్రీకి చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌(ఎస్‌పీ గ్రూప్‌)   విభజన ప్రణాళికను సుప్రీం కోర్టుకు సమర్పించినట్లు గురువారం తెలిపింది. ‘టాటా సన్స్‌ను రెండు గ్రూప్‌లున్న కంపెనీగా చెప్పవచ్చు. 81.6 శాతం వాటా ఉన్న టాటా ట్రస్ట్ర్స్‌, టాటా కుటుంబ సభ్యులు, టాటా కంపెనీలతో కూడిన టాటాగ్రూప్‌ ఒకటి; 18.37 శాతం వాటా ఉన్న మిస్త్రీ కుటుంబం మరొకటి’ అని వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. పసిడి గిరాకీ 30 శాతం తగ్గింది

వ్యాపార కార్యకలాపాలకు కొవిడ్‌-19 సృష్టించిన అవరోధాలకు తోడు ధర బాగా పెరగడంతో దేశంలో పసిడికి గిరాకీ గణనీయంగా తగ్గింది. 2019 ఇదే కాలం నాటి గిరాకీ 124.9 టన్నులతో పోలిస్తే ఈ ఏడాది జులై- సెప్టెంబరులో పసిడి గిరాకీ 30 శాతం మేర క్షీణించి 86.6 టన్నులకు పరిమితమైందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలో తెలిపింది. ధరల పెరుగుదల వల్ల, విలువ ప్రకారం మాత్రం పసిడి డిమాండు రూ.41,300 కోట్ల నుంచి 4 శాతం తగ్గి రూ.39,510 కోట్లకు పరిమితమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. నా కష్టాల్ని మరోసారి గుర్తుచేసింది

దక్షిణాదిలో మరో అగ్ర కథానాయకుడి చిత్రం నేరుగా ఓటీటీ వేదిక ద్వారా విడుదల కాబోతోంది. అదే... సూర్య హీరోగా నటించిన ‘ఆకాశం నీ హద్దురా!’. సుధ కొంగర దర్శకత్వం వహించిన చిత్రమిది. దీపావళి సందర్భంగా నవంబరు 12న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా కథానాయకుడు సూర్య, దర్శకురాలు సుధ కొంగర ఆన్‌లైన్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. చెన్నై కొట్టింది దెబ్బ

ఇప్పటికే ఐపీఎల్‌-13 ప్లేఆఫ్‌ రేసుకు దూరమైన చెన్నై సూపర్‌కింగ్స్‌.. వెళ్తూ వెళ్తూ ప్లేఆఫ్‌ రేసులో ఉన్న జట్లకు షాకిస్తోంది. గత మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును అలవోకగా ఓడించిన సీఎస్‌కే.. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెక్‌ పెట్టింది. రుతురాజ్‌ మరోసారి చక్కటి ఇన్నింగ్స్‌ ఆడగా, ఆఖర్లో జడేజా మెరవడంతో ఆ జట్టు నైట్‌రైడర్స్‌పై గెలిచి వరుసగా రెండో విజయాన్ని దక్కించుకుంది. చెన్నై చేతిలో కోల్‌కతా ఓటమితో నాలుగు జట్లకు మించి ఎనిమిది విజయాలు సాధించే అవకాశాలు లేకపోవడంతో.. ఇప్పటికే 8 మ్యాచ్‌లు నెగ్గిన ముంబయి ఇండియన్స్‌ ప్లేఆఫ్‌ చేరింది. 6 విజయాలతో ఉన్న కోల్‌కతా.. చివరి మ్యాచ్‌లో నెగ్గినా, నెట్‌రన్‌రేట్‌లో బాగా వెనుకబడి ఉన్న నేపథ్యంలో ముందంజ వేయడం కష్టమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.