close

తాజా వార్తలు

Published : 23/07/2020 10:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెరికాలో మళ్లీ రికార్డు స్థాయి మరణాలు!

రిఫ్రిజిరేటర్లలో మృతదేహాలు..

అంత్యక్రియలకు వెయిటింగ్ లిస్ట్‌!

వాషింగ్టన్‌: అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గినట్టే కనిపించినా అగ్రరాజ్యంలో కొవిడ్‌ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా వరుసగా రెండోరోజు 1000కి పైగా కొవిడ్‌ మరణాలు సంభవించినట్టు  రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. మంగళవారం 1100లకు పైగా మరణాలు నమోదవ్వగా.. బుధవారం కూడా దాదాపు అదే తరహాలో మరణాలు చోటుచేసుకున్నాయి. తాజాగా మే 29 తర్వాత ఇంత భారీ సంఖ్యలో మళ్లీ మరణాలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. 

గతంలో కంటే తక్కువే అయినా..
తాజాగా నమోదైన మరణాల్లో అల్బామా, నెవడా, టెక్సస్‌లో రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో కేసులు, మరణాలు మెరగడంతో ఒహైయో, ఇండియానా, మిన్నెసోటా తదితర రాష్ట్రాల గవర్నర్లు మరింత అప్రమత్తమయ్యారు. మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.  మరోవైపు, అమెరికాలో వరుసగా రెండో వారం కూడా మరణాలు పెరుగుతున్నప్పటికీ గత ఏప్రిల్‌లో కనిపించిన స్థాయి కంటే ఇవి తక్కువే. అప్పట్లో రోజుకు సగటున 2,000 మంది వైరస్ బారిన పడి మరణించిన విషయం తెలిసిందే. 

అంత్యక్రియలకు వెయిటింగ్‌ లిస్ట్‌!
 టెక్సాస్‌లో కరోనా ఉద్ధృతి అధికంగా ఉంది. వారం వ్యవధిలోనే మరణాలు రెట్టింపు కావడంతో మృతదేహాలను రిఫ్రిజిరేటర్లలో నిల్వచేస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సైతం తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. అలాగే, హిడాల్గో కౌంటీలో గత వారంలో 60శాతం కేసులు పెరిగినట్టు సమాచారం. హిడాల్గో శ్మశానవాటికలో అంత్యక్రియలకు రెండు వారాల పాటు వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండటంతో.. మృతదేహాలను భద్రపరిచేందుకు ఐదు రిఫ్రిజిరేటెడ్‌ ట్రక్కులను ఉపయోగిస్తున్నారు. ఒక్కొ ట్రక్కులో 50 చొప్పున మృతదేహాలను భద్రపరుస్తున్నారు.  

అమెరికాలో ఇప్పటివరకు 40,38,967 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 11,99,314 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1.45లక్షల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 26,94,269 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.