లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: వీడియోకాల్‌లో వివాహం
close

తాజా వార్తలు

Updated : 04/04/2020 13:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: వీడియోకాల్‌లో వివాహం

కరోనా నేపథ్యంలో ఔరంగాబాద్‌లో..

ఔరంగాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా మహమ్మారి కారణంగా ఈ భూమ్మీద సగం జనాభా ప్రస్తుతం ఇళ్లకే పరిమితమైంది. భారత్‌లోనూ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ఔరంగాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుక.. స్ఫూర్తిదాయకంగా నిలవడంతో పాటు వార్తల్లో నిలిచింది. పెళ్లికొడుకు ఒక చోట, పెళ్లికూతురు మరో చోట ఉండగానే వీడియోకాల్‌లో వివాహ తంతును పూర్తిచేశారు మతపెద్దలు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన మహ్మద్‌ మిన్హాజుద్‌కు.. బీడ్‌ జిల్లాకు చెందిన ఓ యువతితో ఆరు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. అప్పుడు కరోనా ప్రభావం లేకపోవడంతో వివాహ తేదీని ఏప్రిల్‌ 3గా నిర్ణయించినట్లు పెళ్లికుమారుడి తండ్రి మహ్మద్‌ గయాజ్‌ తెలిపారు.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని వేడుకలు, సమావేశాలు రద్దయ్యాయి. జనాలు ఒక చోట నుంచి మరో చోటుకి  వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ పెద్దల సమక్షంలో ఇంట్లో నుంచే.. సదరు యువతితో వీడియోకాల్‌ ద్వారా వివాహం జరిపించారు. మరోవైపు తక్కువ ఖర్చుతో నిరాడంబరంగా ఇలా పెళ్లి జరగడం పట్ల ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని ఆ వివాహం జరిపించిన మత పెద్ద ముఫ్తీ ఉర్‌ రహమాన్‌ పేర్కొన్నారు. ఇదిలాఉండగా, భారత్‌లో ఇప్పటివరకూ మొత్తం 2547 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో 62 మంది మరణించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని