close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 18/06/2020 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అన్‌లాక్‌-1: బస్సు సర్వీసుల్లో ఏపీనే నెం.1

అభీబస్.కామ్‌ వెల్లడి

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో దేశంలో పర్యాటక, రవాణాతో పాటు అన్ని రంగాలూ కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవల ప్రకటించిన అన్‌లాక్‌-1తో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ఏయే రాష్ట్రాలు ఎన్ని బస్సు సర్వీసులను నడిపాయనే విషయంపై ప్రముఖ ఆన్‌లైన్‌ టిక్కెట్ల బుకింగ్‌ సంస్థ అభీబస్‌.కామ్‌ 25 రాష్ట్రాల్లో ఓ సర్వే నిర్వహించింది. ఈ మేరకు పలు ఆసక్తికర గణాంకాలను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత దేశంలోనే అధిక సంఖ్యలో బస్సులు నడిపిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందని అభీ బస్‌ తెలిపింది. కరోనాకు ముందున్న పరిస్థితితో పోలిస్తే ఏపీఎస్ ‌ఆర్టీసీ దాదాపు 70శాతం టిక్కెట్ల విక్రయాలు (కరోనా నిబంధనలతో ఒక సీటు వదిలినప్పటికీ) సాధించిందని ఆ సంస్థ సీవోవో రోహిత్‌ శర్మ వెల్లడించారు. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే బస్సు సర్వీసులు ఎక్కువగా నడిచాయనీ.. టిక్కెట్ల బుకింగ్‌ చాలా బాగుందని తెలిపారు. ఆ తర్వాత స్థానంలో యూపీ ఉన్నట్టు తెలిపారు. దేశంలో సంక్షోభంలో కూరుకుపోయిన రవాణా రంగాన్ని పునరుద్ధరించడంలో ఇతర రాష్ట్రాలకు దారిచూపేలా ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. 

అభీబస్‌ గుర్తించిన కీలకాంశాలివే..  

* ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలోని 137 నగరాలు, పట్టణాలను కలుపుతూ రోజూ 6090 బస్సు సర్వీసులు నడుపుతోంది. విజయవాడ నుంచి అత్యధికంగా 596 సర్వీసులు నడుపుతుండగా.. విశాఖపట్నానికి 383, నెల్లూరుకు 226 సర్వీసులు నడుపుతోంది. అభీబస్‌ కూడా 43 మంది ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా రోజుకు 1,445 బస్సు సర్వీసులను ఏపీలో నడుపుతోంది.

* యూపీ ఎస్‌ఆర్‌టీసీ కూడా లఖ్‌నవూ, నోయిడా, దిల్లీ సహా మొత్తం 45 నగరాలను కలుపుతూ 1,218 బస్సు సర్వీసులను నడుపుతోంది. వీటిలో అత్యధికంగా లఖ్‌నవూకు 267 సర్వీసులు, దిల్లీకి 94, గోరఖ్‌పూర్‌కు 94, బరేలీకి 94, అలహాబాద్‌ 93, ఆగ్రా 81 సర్వీసుల చొప్పున నడుపుతోంది. 30 ప్రైవేటు బస్సు ఆపరేటర్ల ద్వారా రోజుకు 183 సర్వీసులను నిర్వహిస్తోంది.

* ఇక తెలంగాణ విషయానికి వస్తే.. టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌తో పాటు మొత్తం 52 నగరాలు, పట్టణాలను కలుపుతూ రోజుకు 1,110 బస్సు సర్వీసులను నడుపుతోంది. హైదరాబాద్‌ నుంచి 464 సర్వీసులు నడపగా కరీనంగర్‌ నుంచి 122, వరంగల్‌ 70 చొప్పున రోజుకు సర్వీసులు నడుస్తున్నాయి. వీటికి అ దనంగా 19 ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు రోజుకు 93 సర్వీసులు నడిపేందుకు అనుమతిచ్చారు.

* కర్ణాటకలో 72 ప్రైవేటు ఆపరేటర్లు బెంగళూరుతో పాటు కర్ణాటకలో రోజుకు 258 బస్సులను నడుపుతున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.