పసిబిడ్డను ఎత్తుకొని.. ప్లాట్‌ఫాంపై పరుగులు 
close

తాజా వార్తలు

Updated : 19/05/2020 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసిబిడ్డను ఎత్తుకొని.. ప్లాట్‌ఫాంపై పరుగులు 

సోలాపూర్‌ రైల్వేస్టేషన్‌లో కదిలించిన ఘటన 


ముంబయి : వలస కార్మికుల కోసం అధికారులు మహారాష్ట్ర సోలాపూర్‌ నుంచి గ్వాలియర్‌కు ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను వేశారు. రైలు కదిలే సమయానికి ఓ మహిళ నాలుగు నెలల పసిబిడ్డను ఎత్తుకొని ట్రాక్‌పైకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమెను గమనించిన లోకో పైలెట్‌ అధికారుల అనుమతితో రైలును కొద్ది నిమిషాలపాటు నిలిపేశారు. రైలు సమయానికి స్టేషన్‌కు చేరుకునేందుకు సరైన ప్రజారవాణా సౌకర్యాలు లేక బిడ్డను మోసుకుంటూ మహిళ నడుచుకుంటూ రైల్వే ట్రాక్‌పైకి వచ్చింది. అప్పటికే రైలు కదులుతుండగా దూరం నుంచి ఆమెను గమనించిన అధికారులు వెంటనే స్పందించి రైలును పది నిమిషాలు నిలిపేశారు. ఆమె ప్లాట్‌ఫాం వద్దకు రాగానే అక్కడే ఉన్న ఓ ఫొటో జర్నలిస్ట్‌ పసిబిడ్డను తీసుకొని మహిళ రిజర్వ్‌ చేసుకున్న బోగీ వరకు సాయం చేసి మహిళను రైలు ఎక్కించాడు. ఘటనాస్థలంలో ఉన్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇదంతా చూసి ఉద్వేగానికి లోనయ్యారు. 

 

 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని