వైఎస్‌ఆర్‌ సేవలను మరువలేం: ఉత్తమ్‌
close

తాజా వార్తలు

Published : 08/07/2020 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైఎస్‌ఆర్‌ సేవలను మరువలేం: ఉత్తమ్‌

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేరెన్నికగన్న నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన అమలు చేసిన పథకాలను ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పాలకులందరూ పాటిస్తున్నారని కొనియాడారు. వైఎస్‌ఆర్‌ 71వ జయంతి వేడుకలను పంజాగుట్టలో ఘనంగా 
నిర్వహించారు. పంజాగుట్ట సర్కిల్‌లోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, కేవీపీ రామచంద్రరావు, పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్‌ యాదవ్‌, వంశీచందర్‌రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.వీరితోపాటు ఏపీ మంత్రి అనికుల్‌కుమార్‌ యాదవ్‌, ఫిరోజ్‌ఖాన్‌ కూడా 
ఉన్నారు. ఈ సందర్భంగా వారంతా వైఎస్‌ఆర్‌ సేవలను గుర్తు చేసుకున్నారు. రైతులకు ,యువతకు, విద్యార్థులకు, మహిళలకు దివంగత నేత వైఎస్‌ఆర్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. 2023లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం శాయశక్తులా కృషి చేస్తామన్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని