చేనేతలకు అండగా ఉంటాం: జగన్‌
close

తాజా వార్తలు

Updated : 20/06/2020 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేనేతలకు అండగా ఉంటాం: జగన్‌

అమరావతి: చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం రెండోవిడత కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా సీఎం ప్రారంభించారు. గత ఏడాది డిసెంబరులో తొలివిడత ఆర్థిక సాయాన్ని అందించగా.. కొవిడ్‌ ప్రభావంతో ఈ విడత సాయాన్ని ఆరు నెలల ముందుగానే అందిస్తున్నారు. మగ్గం ఉన్న నేతన్నలకు ఈ పథకం ద్వారా రూ.24వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు.

 ఈ సందర్భంగా నేతన్న నేస్తం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం మాట్లాడారు. కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికుల కష్టాలు చూసి.. 6 నెలల ముందుగానే ఆర్థికసాయం అందిస్తున్నట్టు  తెలిపారు. కార్మికులకు మరింత చేయూతనందించేందుకు ఈ-మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం చెప్పారు. అక్టోబర్‌ 2 నుంచి ఈ- ప్లాట్‌ ఫాం అందుబాటులోకి వస్తుందని,  నాణ్యత, రవాణా, నగదు చెల్లింపు అంశాలపై కార్మికులు ప్రధానంగా దృష్టిసారించాలని సీఎం సూచించారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని