గుజరాత్‌ సీఎంకు జగన్‌ ఫోన్‌
close

తాజా వార్తలు

Published : 21/04/2020 11:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుజరాత్‌ సీఎంకు జగన్‌ ఫోన్‌

అమరావతి: గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఫోన్‌ చేశారు. గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వసతి, భోజన సదుపాయాల్లో ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. జగన్‌ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన గుజరాత్‌ సీఎం.. ఏపీ మత్సకారులను ఆదుకుంటామని వెల్లడించారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాదాపు నెల రోజుల రోజుల నుంచి తెలుగు మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకు పోయిన విషయం తెలిసిందే. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని