ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం : జగన్‌
close

తాజా వార్తలు

Updated : 25/05/2020 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం : జగన్‌

అమరావతి : వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకువచ్చి ముందుకెళ్తున్నామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ‘మన పాలన-మీ సూచన’ పేరిట విభాగాల వారీగా సీఎం మేధోమథన సదస్సు నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల మెరుగుదలకు చర్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో జగన్‌ మాట్లాడుతూ..  ‘అవినీతి, వివక్షకు ఎక్కడా తావులేకుండా పనిచేయడం ముఖ్యం. రాష్ట్రంలో గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ చక్కగా పనిచేస్తోంది. వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకువచ్చి ముందుకెళ్తున్నాం. అర్హత ఉండి కూడా లబ్ధిదారులు ప్రయోజనం పొందకపోతే చాలా బాధ కలుగుతుంది. అందుకే ప్రతి లబ్ధిదాదుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి నేరుగా ఇళ్లకే సేవలు అందిస్తున్నాం. ప్రతి 2 వేల జనాభా కలిగిన గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని 11,162 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పథకాలు, సేవలను ప్రజల గడప వద్దకే తీసుకెళ్లే అవినీతి లేని, పారదర్శకత ఉన్న ఓ గొప్ప వ్యవస్థను సృష్టించాం. అర్హులైన వారందరికీ సంతృప్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు, సేవలు అందిస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో ఇది ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఏడాది తిరగకముందే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం’

‘కరోనా విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల కృషి గొప్పది. ఇంటింటి సర్వే చేసి మందులు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. మద్యం దుకాణాలను నేరుగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మద్యం గొలుసు దుకాణాలు లేకుండా చేయగలిగాం. పాఠశాలల్లో ఉన్న పరిస్థితులను నాడు-నేడుతో పూర్తిగా మార్చేస్తున్నాం’ అని జగన్‌ అన్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని