ఏపీ: ప్రవీణ్‌ ప్రకాశ్‌కు కీలక బాధ్యతలు
close

తాజా వార్తలు

Updated : 09/07/2020 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ: ప్రవీణ్‌ ప్రకాశ్‌కు కీలక బాధ్యతలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యదర్శులకు శాఖల కేటాయింపులో కొన్ని సవరణలు చేశారు. సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. హోం, రెవెన్యూ, జీఏడీ, న్యాయ, ఆర్థిక, ప్రణాళిక శాఖల బాధ్యతలను ప్రవీణ్‌ ప్రకాశ్‌కు అప్పగించారు. దీంతోపాటు విభజన చట్టం, కేంద్ర,రాష్ట్ర సంప్రదింపులు, సీఎంవో అవసరాల పర్యవేక్షణ కూడా చూస్తారు. సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌కు రవాణా, రోడ్లు, భవనాలు, హౌసింగ్‌ శాఖ బాధ్యతలు కేటాయించారు. వీటితోపాటు పౌరసరఫరాలు, పంచాయతీరాజ్‌, సంక్షేమ, పరిశ్రమలు, మౌలికవసతులు, ఐటీ, మైన్స్‌, కార్మికశాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు. ధనుంజయ రెడ్డికి జలవనరులు, వ్యవసాయం, పర్యావరణ శాఖ బాధ్యతలు చూస్తారు. పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, విద్యుత్తు, టూరిజం, మార్కెటింగ్‌ శాఖ బాధ్యతలు అప్పగించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని