
తాజా వార్తలు
సికింద్రాబాద్లో ఘనంగా ఆర్మీ డే
హైదరాబాద్: ఆర్మీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఉన్న వీర సైనికుల స్మారక స్తూపం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మేజర్ జనరల్ ఆర్కే సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని వీర జవాన్లకు నివాళులర్పించారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను ఈ సందర్భంగా ఆర్కే సింగ్ సన్మానించారు. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులైన సమీర్, వర్ష దంపతుల కుమార్తె నియోరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెండేళ్ల క్రితం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సమీర్ దంపతులు నియోరాతో కలిసి పాల్గొన్నారు. జవాన్లను చూసి ముచ్చటపడిన నియోరా తాను ఆర్మీ దుస్తులు వేసుకుంటానని తల్లిని కోరింది. ఈ విషయాన్ని సమీర్.. పీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్మీ దుస్తులు వేసుకొని జవాన్లను కలవడానికి నియోరాకు అనుమతి లభించింది. దీంతో తాజాగా ఆర్మీ వేడుకల్లో పాల్గొన్న నియోరా జవాన్లకు అభినందనలు తెలిపింది.
ఇదీ చదవండి..
‘మీ త్యాగాలకు భారతావని రుణపడి ఉంటుంది’