సమీక్షలతో చేతులు దులుపుకుంటున్నారు
close

తాజా వార్తలు

Published : 25/04/2021 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమీక్షలతో చేతులు దులుపుకుంటున్నారు

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ నిర్లక్యం వల్లే రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే కేసులు పది లక్షలు దాటాయన్నారు. ప్రపంచమంతా కరోనా కట్టడికి పోరాడుతుంటే సీఎం మాత్రం రాజకీయ పోరులో బిజీగా ఉన్నారని విమర్శించారు. కొవిడ్‌ పరీక్ష మొదలు చికిత్స వరకు బాధితులు పడిగాపులు కాస్తుంటే.. తూతూ మంత్రంగా సమీక్షలతో చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రోజురోజుకూ ఆక్సిజన్‌ కొరత తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పడకలు దొరక్క కరోనా బాధితులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ ఆస్పత్రులను పెంచకుండా, క్వారంటైన్ కేంద్రాలను పట్టించుకోకుండా సర్కారు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసలుబాటు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని