బర్డ్‌ ఫ్లూపై నివేదికలివ్వండి..
close

తాజా వార్తలు

Published : 05/01/2021 22:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బర్డ్‌ ఫ్లూపై నివేదికలివ్వండి..

రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన కేరళ

(ప్రతీకాత్మక చిత్రం)

దిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వణ్యప్రాణుల విభాగాలు బర్డ్‌ఫ్లూపై నివేదికలు సమర్పించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆదేశించింది. భారత్‌లోని హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బర్డ్‌ఫ్లూను అన్ని రాష్ట్రాలు తీవ్రంగా పరిగణించి అప్రమత్తంగా ఉండాలని కేంద్రం పేర్కొంది. బర్డ్‌ఫ్లూను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది. వైరస్‌ వ్యాప్తిని అదుపులో ఉంచేందుకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలిపింది. రాష్ట్రాల్లో పక్షుల మరణాలపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించింది. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో 2,300 వలస పక్షులు బర్డ్‌ఫ్లూ బారిన పడి మరణించినట్లు ఆ రాష్ట్ర అటవీశాఖ ధ్రువీకరించింది. సుమారు 57వేల వలస పక్షులు వలస వచ్చినట్లు అంచనా వేస్తున్నామని వారు తెలిపారు. మరణించిన పక్షులను నిబంధనలకు అనుగుణంగా ఖననం చేస్తున్నామని వెల్లడించారు. కేరళలోని రెండు జిల్లాల్లో 40వేలకు పైగా బాతులు మృత్యువాత పడటంతో బర్డ్‌ఫ్లూను రాష్ట్ర విపత్తుగా ప్రకటించి ఆ రెండు జిల్లాల్లో హైఅలర్ట్‌ను ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని మాండ్సౌర్‌లో 15 రోజుల పాటు కోడిమాంసం, కోడిగుడ్ల దుకాణాలను మూసేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి..

పదిరోజుల్లోనే వ్యాక్సిన్‌ పంపిణీ షురూ..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని