close

తాజా వార్తలు

Published : 04/08/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘‘3 ప్రాంతాలకు జగన్‌ అన్యాయం చేస్తున్నారు’’

ఎమ్మెల్సీ బీటెక్‌ రవి

తుళ్లూరు: ఏపీ రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న నిరసన 230వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెదపరిమిలో ధర్నాలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో రైతుల ధర్నా శిబిరాన్ని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘రాష్ట్రం మూడు ముక్కలవుతుంటే బాధగా ఉంది. మూడు ప్రాంతాలకు జగన్‌ అన్యాయం చేస్తున్నారు. ప్రశాంతమైన విశాఖ ఏమవుతోందనని భయమేస్తోంది. నమ్మి భూములు ఇచ్చినందుకు రాజధాని రైతులను వంచించారు. వెంటనే కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి. ఆ ప్రాంతంపై ప్రేమ ఉంటే రాజీనామా చేసి గెలవాలి. ఇవాళ మండలి ఛైర్మన్‌ ఇచ్చే ఫార్మాట్‌లో ఎమ్మల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా. ప్రజలకు మద్దతుగా న్యాయపోరాటం చేస్తా’’అని బీటెక్‌ రవి తెలిపారు. 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.