బిల్లులు ఆపేయడం కక్షసాధింపే: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 26/06/2020 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిల్లులు ఆపేయడం కక్షసాధింపే: చంద్రబాబు

అమరావతి: కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు నిలిపివేతపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. పశ్చిమ చిత్తూరు ప్రాంతంలో తీవ్ర తాగు, సాగునీటి ఎద్దడి ఉందని, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో వివరించారు. తెదేపా హయాంలో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు.

ఇంకా రూ.50కోట్ల విలువైన పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. మిగిలిన 10శాతం పనులను ఏడాదిగా నిలిపివేయడం బాధాకరమన్నారు. గతంలో చేసిన పనులకు బిల్లులు నిలిపివేయడం కక్ష సాధింపు చర్యేనని పేర్కొన్నారు. కుప్పం బ్రాంచి కాలువ పనులు సకాలంలో పూర్తి చేస్తే 110 చెరువులకు నీళ్లు అందించే అవకాశం ఉందన్నారు. తెదేపా హయాంలో తాగు, సాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు  గుర్తు చేశారు. వైకాపా ఏడాది పాలనలో జల వనరులను పూర్తిగా పక్కన బెట్టారని చంద్రబాబు ఆరోపించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని