‘జగన్‌ అలసత్వం వల్లే కరోనా విలయతాండవం’
close

తాజా వార్తలు

Published : 20/04/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జగన్‌ అలసత్వం వల్లే కరోనా విలయతాండవం’

తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు

అమరావతి‌: కరోనా పట్ల సీఎం జగన్‌ అలసత్వం ప్రదర్శించడం వల్లే ఏపీలో కొవిడ్‌ విలయతాండవం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడకుండా వారు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రణాళికాలోపం, అవగాహనా రాహిత్యంతోనే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి సీఎం బయటకు రాకపోగా ఉద్యోగుల రక్షణకు ఎలాంటి శ్రద్ధ పెట్టకుండా తప్పనిసరిగా విధులకు హాజరుకావాలంటూ బెదిరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వారం రోజుల వ్యవధిలో పలువురు ఉద్యోగులు చనిపోవడం బాధాకరమని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని.. ఉద్యోగుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదాయం కోసం మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసి మరీ వేధించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ టీకాలు వేసే ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఉద్యోగులకు ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు, శానిటైజర్ వంటివి అందించటంతో పాటు. కరోనా బారిన పడిన ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలని సూచించారు. విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని