వ్యవస్థలను కుప్పకూలుస్తున్నారు: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 19/06/2020 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యవస్థలను కుప్పకూలుస్తున్నారు: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలపై గవర్నర్‌ను కలిసి వివరించినట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులు బిల్లులను ఇంతకుముందే మండలికి తీసుకువచ్చారని, ఆ రోజు కూడా 15 మంది మంత్రులు మండలిలో రౌడీయిజం చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీలో వైకాపాకి మెజార్టీ ఉంటే, మండలిలో తెదేపాకి మెజార్టీ ఉందని వెల్లడించారు. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులు.. రాజ్యసభలో ఎన్నో ఆగిపోయాయని గుర్తు చేశారు.

మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. ప్రధాన వ్యవస్థలను కుప్పకూల్చే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొస్తోందని మండిపడ్డారు. నలుగురు మాజీ మంత్రులపై అక్రమ కేసులు పెట్టారని, అమరావతి రైతులను హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతలా ఉన్మాద పాలన చేస్తుంటే చూస్తూ సహించాలా అని ప్రశ్నించారు. వైకాపా దుర్మాగమైన పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మిగతా పార్టీల వారిని నామినేషన్ వేయకుండా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా భయాంకరగా ఉందని తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని