close

తాజా వార్తలు

Updated : 31/07/2020 19:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గవర్నర్‌ నిర్ణయంపై పోరాటం: చంద్రబాబు

ఇవాళ రాష్ట్ర చరిత్రలో చీకటి రోజని వ్యాఖ్య

హైదరాబాద్‌: ఇవాళ రాష్ట్ర చరిత్రలో చీకటి రోజని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ తీసుకున్న‌ నిర్ణయం చారిత్రక తప్పిదమని, రాజ్యాంగ విరుద్ధమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదించడంపై చంద్రబాబు వీడియో మాధ్యమం ద్వారా మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతున్న వేళ ఇలాంటి నిర్ణయమేంటని ఆయన ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో చిచ్చురేపే నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.

‘‘రాజధాని కోసం 29 వేల మంది రైతులు తమ భూములు త్యాగం చేశారు. ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు ఆ భూములు ఇచ్చారు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం రాజధానిని నాశనం చేసింది. రాజధాని విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రజల స్వప్నం నీరుగార్చారు. ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడా లేవు. ఈ బిల్లులను తీసుకొచ్చి విభజన చట్టానికి చిల్లులు పొడిచారు. రాజధాని బిల్లుకు మద్దతిస్తున్నానని జగన్‌ ఆ రోజు సభలో చెప్పారు. ఇప్పుడు జగన్‌ మడమ తిప్పి రాష్ట్రానికి ద్రోహం చేశారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. కానీ మూడు రాజధానుల పేరుతో అందరినీ అయోమయానికి గురిచేస్తున్నారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర అభివృద్ధికి విఘాతం’’ అని విమర్శించారు. మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం కోరుతూ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 

‘‘అమరావతి అనేది రాష్ట్రం నడిబొడ్డున ఉంది. ఇక్కడ ఉండే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవచ్చు. రాజధానిగా అమరావతి ప్రకటన సమయంలోనే మేం జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళిక ప్రకటించాం. అన్ని జిల్లాలకు ప్రాజెక్టులు, పరిశ్రమలు వచ్చేలా చూశాం. చిత్తూరు పారిశ్రామిక కేంద్రంగా, రాయలసీమను పారిశ్రామిక హబ్‌గా చేసి ఎన్నో ప్రాజెక్టులు చేపట్టాం. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వైకాపా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. ఈ 14 నెలల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప మరేం జరగలేదు. గవర్నర్‌ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తాం. అమరావతి ఐకాస పిలుపు మేరకు రైతుల పక్షాన ఉద్యమిస్తాం. రాజకీయ పార్టీగా మా బాధ్యత నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఐకాస, రాజకీయ పార్టీల కార్యక్రమాలకు ప్రజలంతా మద్దతివ్వాలి’’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.