ఏడాది పాలనలో అందరికీ వేదనే: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 02/06/2020 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడాది పాలనలో అందరికీ వేదనే: చంద్రబాబు

అమరావతి: ఏడాది పాలనలో బడుగు వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకపోగా.. గౌరవ ప్రదమైన పదవుల్లో ఉన్నవారిని వైకాపా ప్రభుత్వం అవమానించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మండలి ఛైర్మన్‌, షరీఫ్, డాక్టర్ సుధాకర్ ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. ‘చేతకాని పాలన- అందరికీ వేదన’ పేరిట మరో వీడియోను చంద్రబాబు తన ట్విటర్‌ ఖాతాలో విడుదల చేశారు. ఇకనైనా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకుని సమసమాజ స్థాపనకు కృషిచేయాలని హితువు పలికారు.

చేతకాక కొంత.. మోసపూరిత మనస్తత్వంతో ఇంకొంత.. మొండితనం, తన మాటే చెల్లాలనే మూర్ఖత్వం మరికొంత.. ఇలా అవలక్షణాలన్నీ కలగలిసిన వైకాపా నేతల ఏడాదిపాలన అందరికీ వేదననే మిగిల్చిందని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో అందరూ భవిష్యత్‌పై బెంగతో ఉన్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, రైతులు, మహిళలు, యువత... ఇలా అన్నివర్గాల వారినీ మోసం చేశారని ధ్వజమెత్తారు. వైకాపా చేసిన మోసానికి బీసీలు స్థానిక ఎన్నికల్లో ఏకంగా 10 శాతం రిజర్వేషన్లను పోగొట్టుకున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని