3నెలల కరెంటుబిల్లు రద్దు చేయాలి: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 21/05/2020 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3నెలల కరెంటుబిల్లు రద్దు చేయాలి: చంద్రబాబు

హైదరాబాద్‌: గుంటూరు సంపత్‌నగర్‌లో గుడిసెలో ఉండే వ్యక్తికి రెండు నెలల్లో రూ.3వేల కరెంటు బిల్లు వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెంచి పేద ప్రజలు విద్యుత్‌ వాడుకోకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రూ.వేలల్లో వచ్చిన బిల్లులు చూసి ప్రజలు షాక్‌కు గురవుతున్నారన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే విద్యుత్‌ కొరతను అధిగమించి.. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో 3 నెలల పాటు కరెంట్‌ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

‘‘అధికారంలోకి వస్తూనే పీపీఏలపై పడ్డారు. విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయడం వల్ల పెట్టుబడి పెట్టేందుకు ఎవరినీ రాకుండా చేశారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదని బుకాయిస్తూ శ్లాబ్‌లు మార్చి భారం మోపటం పెద్ద మోసం. అసత్యాలు చెప్పడంలో జగన్‌ సిద్ధహస్తులు. ఫ్యాన్‌కు ఓటేస్తే భవిష్యత్తు ఉంటుందని నమ్మినోళ్లు ఇంట్లో ఫ్యాన్‌ వేయలేని పరిస్థితిలో ఉన్నారు. మోసం చేసినందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో సహజీవనం చేయాలని చెబుతున్నారు. కరోనా అందరికీ రావాలని సీఎం కోరుకుంటున్నారా? ప్రజల జీవితాలతో ఆడుకోవటం మంచి పద్ధతికాదు’’ అని చంద్రబాబు హెచ్చరించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై మరింత శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. దాతలు ఇచ్చిన భూములు, ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు.. ప్రజల ఆస్తులను విక్రయించే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. చట్టాన్ని గౌరవించకుండా ఉల్లంఘించి ప్రజలముందు అపహాస్యం పాలవుతున్నారని విమర్శించారు. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని