దేవినేని ఉమాకు సీఐడీ నోటీసులు
close

తాజా వార్తలు

Updated : 15/04/2021 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేవినేని ఉమాకు సీఐడీ నోటీసులు

విజయవాడ: మాజీ మంత్రి తెదేపా సీనియర్‌నేత దేవినేని ఉమా మహేశ్వరరావుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఇవాళ ఉదయం కర్నూలు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని గొల్లపూడిలోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు.

ఈనెల 7న దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మార్ఫింగ్‌ చేసిన జగన్‌ వీడియోలు ప్రదర్శించారని అభియోగం. ఈమేరకు 464, 465, 468, 469, 470, 471, 505, 120(బి) సెక్షన్ల కింద ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని