సీఎం జగన్‌ నివాసం వద్ద కరోనా కలకలం
close

తాజా వార్తలు

Published : 04/07/2020 19:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎం జగన్‌ నివాసం వద్ద కరోనా కలకలం

8మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్‌

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. తాడేపల్లిలోని కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న ఎనిమిది మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన 8మంది సెక్యూరిటీ గార్డులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 2న సీఎం నివాసం వద్ద భద్రతా సిబ్బందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించిన అధికారులు.. ఆ ఫలితాలను ఈ రోజు వెల్లడించారు. దీంతో సీఎం కార్యాలయం వద్ద కరోనా కలకలం మొదలైంది. గతంలోనూ సీఎం నివాసం వద్ద ఇద్దరు భద్రతా సిబ్బందికి కరోనా సోకింది. తాజగా కరోనా బారినపడిన ఎనిమిది మంది కానిస్టేబుళ్లను క్వారంటైన్‌కు తరలించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని