నేను విజయ్‌ దేవరకొండ.. నాపేరు అజయ్‌ భూపతి..!
close

తాజా వార్తలు

Published : 03/07/2020 09:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను విజయ్‌ దేవరకొండ.. నాపేరు అజయ్‌ భూపతి..!

యువతకు సైబర్‌ నేరస్థుల వల

 హైదరాబాద్‌; నారాయణగూడ : సినిమాలు, టీవీ సీరియళ్లు, మోడలింగ్‌లో శిక్షణ ఇస్తామంటూ సైబర్‌ నేరస్థులు సరికొత్త మోసాలకు తెరలేపారు. సినీ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ, ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి పేర్లతో సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పించి యువతను ఆకర్షిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఫొటోలు, వీడియోలు పంపిస్తే.. అదనపు ఆకర్షణలు జోడించి సినిమాలు, టీవీ సీరియళ్లు, తదితర కార్యక్రమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ రూ.వేలల్లో బదిలీ చేయించుకుంటున్నారు. స్థానిక యువతను బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారాలకు ఎంపిక చేసుకుంటున్నారని రూ.25వేలు చెల్లిస్తే సరిపోతుందంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. తాజాగా అజయ్‌భూపతి పేరుతో వాట్సాప్‌ నంబర్‌ను సృష్టించి కథానాయికలు కావాలంటూ ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు యువతులు నేరుగా దర్శకుడిని సంప్రదించగా.. ఇదంతా మోసమని పేర్కొన్న ఆయన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు తన పేరుతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి యువతులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

●బాన్సువాడకు చెందిన సాయికిరణ్‌ విజయ్‌ దేవరకొండ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. ఆయనలా మాట్లాడి యువతులను ఆకర్షించేందుకు యత్నించాడు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, విజయ్‌ దేవరకొండ బృందం సభ్యులు సాయికిరణ్‌ను పట్టుకునేందుకు ఒక యువతితో మాట్లాడించి హైదరాబాద్‌కు రప్పించి అరెస్ట్‌ చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని