
తాజా వార్తలు
TS: 20 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికం
ఓటరు జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
హైదరాబాద్: జనవరి 1, 2021 నాటికి తెలంగాణలో అర్హులైన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో 2,82,497 మంది కొత్తగా ఓటు హక్కు పొందగా.. 1,72,255 మంది ఓట్లను తీసేసినట్లు పేర్కొంది. మొత్తం ఓటర్లలో 1,51,61,714 మంది పురుష ఓటర్లు, 1,50,02,227 మహిళా ఓటర్లు, 1,628 ఇతర ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. జిల్లాల వారీగా చూస్తే రాష్ట్రంలోని 20 జిల్లాల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 43,11,803 ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,14,291 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం జాబితా విడుదల చేసింది.
ఇవీ చదవండి..
30 మంది చొప్పున 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
ఏపీలో వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం